హీరో కాస్త ఓవర్‌గా నటించడానికి ఖాకీ డ్రెస్‌ని మించింది లేదు. ఊరికే ఒంటి చేత్తో వందల మందిని కొట్టేసే బదులు పోలీస్‌గా అయితే కాస్త రీజన్ వుంటుందని సినిమా వాళ్ళ సిద్ధాంతం. పూరి జగన్నాథ్ చేస్తున్న సినిమాలో ఎన్టీఆర్‌ది పోలీస్ క్యారెక్టర్ అని తెలిసిపోయింది. ఇప్పటికే కొన్ని సినిమాల్లో పోలీస్‌గా చేశాడాయన.
కానీ ఈ పోలీస్ అదో రకం పోలీసని పూరి చెబుతున్నాడు. సినిమాల్లో పోలీసులు అంటే చాలా అతిగా వుంటారని ఇప్పటికే రవితేజ, సాయికుమార్, బాలకృష్ణ లాంటివాళ్ళు ప్రూవ్ చేసి పారేశారు. మళ్ళీ ఎన్టీఆర్ పోలీసేంట్రా బాబూ.. అని కొంతమంది అనుకుంటున్నా పూరి జగన్నాథ్ మాత్రం ఎంతో పవర్‌ఫుల్‌గా ఈ క్యారెక్టర్‌ని తీర్చిదిద్దాడట.
ఎన్టీఆర్‌కి కథలు ఇచ్చే రైటర్ వక్కంతం వంశీ ఆయనకు బాగా స్టూయ్యే కథని తయారు చేశాడట. ఇంకేముంది.. జూనియర్ ఎన్టీఆర్ తన చేతిలోని లాఠీని అటూ ఇటూ తిప్పేస్తూ పోలీసంటే అదనీ ఇదనీ డైలాగ్స్ చెప్పేసి విలన్స్‌ని చితగ్గొటొఏ్టస్తాడని వేరే చెప్పక్కర్లేదుగా. ఎందుకన్నా మంచిది.. ఈసారి ఎన్టీఆర్ మంచి కథతో వస్తేనే బేరం వుంటుంది. లేదంటే కష్టాల కాలమే మరి.