గజల్‌- ప్రదీప్‌.. శిఖరం నుంచి పతనం దాకా!

బుల్లితెరపై స్టార్‌ యాంకర్స్‌లో ఆయనా ఒకరు. మేల్‌ యాంకర్స్‌లో టాప్‌ ప్లేస్‌లో వున్నాడతడు. బుల్లితెర వీక్షకు లకు పరిచయం అక్కర్లేని పేరు అది. అతనే ప్రదీప్‌ మాచి రాజు.. బుల్లితెరపైనే కాదు, అడపా దడపా…

బుల్లితెరపై స్టార్‌ యాంకర్స్‌లో ఆయనా ఒకరు. మేల్‌ యాంకర్స్‌లో టాప్‌ ప్లేస్‌లో వున్నాడతడు. బుల్లితెర వీక్షకు లకు పరిచయం అక్కర్లేని పేరు అది. అతనే ప్రదీప్‌ మాచి రాజు.. బుల్లితెరపైనే కాదు, అడపా దడపా సినిమాల్లోనూ కన్పిస్తోన్న ప్రదీప్‌, ఆమధ్య 'డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌'పై సందేశా త్మకంగా మాట్లాడాడు. విచిత్రమేంటంటే, అదే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌కేసులో పోలీసులకు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికేశాడు.

తెలుగునాట గజల్స్‌ అనే మాట విన్పిస్తే, ముందుగా గుర్తుకొచ్చే పేరు గజల్‌ శ్రీనివాస్‌. గజల్స్‌ రంగంలో ఈ తరానికి పరిచయం అక్కర్లేని పేరు అది. 'నీ బడి పిలు స్తోంది..' అంటూ ఆయన పాడిన పాట అప్పట్లో ఓ సంచ లనం. వివిధ భాషల్లో అద్భుతమైన గజల్స్‌ ఆలపించిన గజల్‌ శ్రీనివాస్‌, ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ కేసులో బుక్‌ అయ్యారు.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ అలవాటైపోయింది!

'డోన్ట్‌ మిక్స్‌ డ్రైవింగ్‌ విత్‌ డ్రింకింగ్‌' అని ఎంతగా అవ గాహన కల్పించే కార్యక్రమాలు చేపడ్తున్నా, 'డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌' కేసులు తగ్గడంలేదు సరికదా, ఎప్పటికప్పుడు సరి కొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నాయి. మద్యం షాపుల దగ్గరా, బార్‌ అండ్‌ రెస్టారెంట్ల దగ్గరా, పబ్‌ల దగ్గరా 'హెచ్చరిక' బోర్డులున్నా, అవి సిగరెట్‌ ప్యాకెట్‌ మీద హెచ్చరికల్లా మిగిలిపోతున్నాయంతే. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో సెల బ్రిటీ పట్టుబడ్డాడంటే అదో హాట్‌ టాపిక్‌ అవడం సర్వ సాధారణమైపోయింది.

కొన్నాళ్ల క్రితం యంగ్‌ హీరో నవ దీప్‌ ఇలాగే పట్టుబడ్డాడు. ఆ తర్వాత చాలామంది సినీ ప్రముఖులు ఈ తరహా కేసుల్లో బుక్‌ అయ్యారు. మాస్‌ మహరాజ్‌ రవితేజ సోదరుడు భరత్‌, మద్యం సేవించి వాహనాన్ని నడిపి ప్రాణాలుకోల్పోయాడు కూడా. మద్యం సేవించి వాహనాన్ని నడపడమంటే తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవడమే కాదు, ఇతరు ప్రాణాలకీ ముప్పు తెచ్చినవారవుతారు. అయితే, ఇది మాటలకే పరిమితమ వుతోంది. చిత్రంగా, ఆయా ప్రముఖులు 'డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌'కి వ్యతిరేకంగా మాట్లాడతారుగానీ, ఆచరించరు.

ఇంత గోల ఎందుకు.? అసలంటూ మద్యాన్ని నిషేధిస్తే పోలా.! అన్న చర్చ అప్పుడప్పుడూ జరిగినా, ప్రభుత్వాలకి ఖజానా మీద 'యావ' తగ్గదు కాబట్టి, మద్యనిషేధం – నియంత్రణ అన్న మాటలు ఎప్పటికీ బూతులుగానే మిగి లిపోతాయి. జరీమానాలు, జైలు శిక్షలు.. ఇవేవీ 'డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌' కేసుల్ని తగ్గించడంలేదంటే, దానర్థమేంటి.? వ్యవస్థ ఎంతలా ఈ విషయంలో ఫెయిల్‌ అవుతోందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.! కొన్నాళ్ల క్రితం నవదీప్‌, ఇప్పుడు ప్రదీప్‌.. రేప్పొద్దున్న ఇంకెవరో.. అంతేనా, ఇంకేమీ లేదా.?

గజల్‌ వెనుక నా సామి.!

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ విషయంలో ఎలాగైతే 'మందుబా బులు' మారడంలేదో, లైంగిక వేధింపుల ఘటనలూ అలాగే మారిపోయాయి. అత్యంత కఠినమైన చట్టాలొస్తు న్నాసరే, లైంగిక వేధింపుల ఘటనలు కొత్త కొత్తగా వెలు గుచూస్తూనే వున్నాయి. తాజాగా, గజల్‌ శ్రీనివాస్‌ లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కుపోవడమే అందుకు ఉదాహ రణ. తన దగ్గర పనిచేసే ఓ యువతి పట్ల అభ్యంతరకర రీతిలో వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో గజల్‌ శ్రీనివాస్‌ అరెస్ట్‌ అయ్యారు.

గజల్‌ రంగంలో ఎంతో పేరు తెచ్చుకున్న గజల్‌ శ్రీనివాస్‌ గురించి ఇప్పుడు సమాజం ఎలా మాట్లాడుకుంటోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.? 'గజల్‌ వెనుక నా సామి' అంటూ ఆయ నపై సెటైర్లు పడ్తున్నాయంటే, ఇన్నాళ్లూ ఆయన సాధిం చిన పేరు ప్రఖ్యాతులు ఏమైనట్టు.? 'చాలామందిని వేధిం చాడు..' అని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 'అవన్నీ ఉత్త ఆరోపణలు మాత్రమే.. నాపై ఆమె ఎందుకు అలా కేసు పెట్టిందో తెలియదు. తనంతట తానే నాకు మసాజ్‌ చేస్తానని వచ్చింది' అంటూ గజల్‌ అత్యంత అమాయకంగా ఆరోపించడం కొసమెరుపు ఈ ఘటనలో.

ఆమె వచ్చిందే నిజమనుకుందాం.. గజల్‌ ప్రబుద్ధుడు కదా.. నీతులు వల్లించే గొప్ప వ్యక్తి కదా.. ఈయనగారి బుద్ధి ఏమయ్యిందట.? అనే ప్రశ్నలకు స్వయంగా ఆయనే ఆస్కారం కల్పించారు. చట్టాలున్నాయ్‌, శిక్షలున్నాయ్‌.. కానీ, ఎందుకిలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయ్‌. ఇదొక మిలియన్‌ డాలర్‌ ప్రశ్న అంతే.

ఏదిఏమైనా, పేరు సంపాదించుకోవడం చాలా చాలా కష్టం. కానీ, అలా సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతుల్ని నిలబెట్టుకోవడమే కష్టం. కొత్త సంవత్సరంలో.. ఇద్దరు ప్రముఖులు ఇలా తమ స్థాయిని మర్చిపోయి, వివాదాల్లో ఇరుక్కున్నారు. ఆయా రంగాల్లో 'శిఖరం'తో సమానం అనదగ్గ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని, ఇదిగో.. ఇలా సమాజం దృష్టిలో పలచనైపోయారు.

-సింధు