గీతాంజలి 2…త్రిపుర

హర్రర్ కామెడీ జోనర్ అంటే చాలు జనం ముందు వెనుక చూడకుండా హిట్ చేసాసారు ఆమధ్య. కాస్త బాగుంటే చాలు కాసులు కురిపించారు. అలాంటి వాటిలో గీతాంజలి ఒకటి. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్…

హర్రర్ కామెడీ జోనర్ అంటే చాలు జనం ముందు వెనుక చూడకుండా హిట్ చేసాసారు ఆమధ్య. కాస్త బాగుంటే చాలు కాసులు కురిపించారు. అలాంటి వాటిలో గీతాంజలి ఒకటి. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అంజలి రేటు పెంచడంతో కలర్స్ స్వాతిని తీసుకున్నారు. 

ఆరంభంలో గీతాంజలి 2 అని అనుకున్నా, ఇప్పుడు త్రిపుర అని పేరు ఫిక్స్ చేసినట్లు బోగట్టా. తెలుగునాట సీక్వెళ్లు అచ్చిరాకపోవడం, పార్ట్ 2 అంటే అంచనాలు పెంచుకోవడం, పైగా మొదటి సినిమాకు కొనసాగింపు అనుకోవడం వంటి వ్యవహారాలు వుంటాయి. అందుకే కొత్త పేరు పెట్టాలని చూస్తున్నారు. 

త్రిపుర అన్న టైటిల్ ఎలా వుంటదన్నదగ్గర ప్రస్తుతం ఆగారు. సినిమా హీరోయిన్ పేరు అది. గీతాంజలి ఆ సినిమాలో. ఈ సినిమాలో త్రిపుర. మరి అదే ఖాయం కావచ్చు.