సందీప్ కు చోటామామ అండ

సందీప్ కిషన్..ప్రస్థానం సినిమాతోనే నటుడిగా తనేంటో ప్రూవ్ చేసుకున్నవాడు. 2013 లో నాలుగు, 2014లో నాలుగు సినిమాలు చేసాడు..హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా. ఇప్పుడు ఇంకా టైగర్ సినిమా చేతిలో వుంది.  Advertisement…

సందీప్ కిషన్..ప్రస్థానం సినిమాతోనే నటుడిగా తనేంటో ప్రూవ్ చేసుకున్నవాడు. 2013 లో నాలుగు, 2014లో నాలుగు సినిమాలు చేసాడు..హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా. ఇప్పుడు ఇంకా టైగర్ సినిమా చేతిలో వుంది. 

ఇంతచకచకా సినిమాలు రావడం, చేయడం వెనుక సందీప్ కెరీర్ ప్లానింగ్, సినిమా వ్యవహారాలు అన్నీ అతని మేనమాట చోటా కె నాయుడు చూడడమే కారణమట. సందీప్ కు వరుసగా సినిమాలు రావడం వెనుక చోటా ప్లానింగ్ వుందని వినికిడి,. 

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, బీరువా, టైగర్ వీటన్నిటికీ చోటా మామే కెమేరామెన్. అంతే కాదు బీరువా ప్రాజెక్టు ఇద్దరు పెద్ద నిర్మాతలో మెటీరియలైజ్ కావడానికి కూడా చోటాయే కారణమని టాలీవుడ్ టాక్. మేనల్లుడిపై మామయ్యకు ఆ మాత్రం శ్రద్ధ వుండడం మంచిదే. కానీ ఇంకా కాస్త మంచి కథాంశాలు, స్క్రిప్ట్ లు చూడడం అవసరం.