గీతగోవిందంలో కీలక సీన్ అదేనా?

విజయ్ దేవరకొండ అప్ కమింగ్ మూవీ గీత గోవిందం. అతగాడిదే టాక్సీవాలా కూడా. ఆ సినిమాను పక్కనపెట్టి, ఈ సినిమాను ముందుకు తెచ్చారు. శ్రీరస్తు-శుభమస్తు సినిమా తరువాత డైరక్టర్ పరుశురామ్ బుజ్జి మళ్లీ గీతాబ్యానర్…

విజయ్ దేవరకొండ అప్ కమింగ్ మూవీ గీత గోవిందం. అతగాడిదే టాక్సీవాలా కూడా. ఆ సినిమాను పక్కనపెట్టి, ఈ సినిమాను ముందుకు తెచ్చారు. శ్రీరస్తు-శుభమస్తు సినిమా తరువాత డైరక్టర్ పరుశురామ్ బుజ్జి మళ్లీ గీతాబ్యానర్ లోనే చేస్తున్న సినిమా ఇది. దాదాపు ఈ సినిమా కూడా అదే లైన్ లో సాగుతుందని తెలుస్తోంది. ఒకరంటే ఒకరికి సరిపడని అమ్మాయి.. అబ్బాయిల మధ్య నడిచే కథగా తెలుస్తోంది.

ఇదిలా వుంటే ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య మాంచి రసవత్తరమైన ముద్దు సీన్ వుందని, అదే సినిమాకు కీలకమలుపు అని తెలుస్తోంది. అక్కడి నుంచే సినిమా టర్న్ తీసుకుని ముందుకు సాగుతుందని వినికిడి. విజయ్ దేవరకొండ అంటే యూత్ కు మాంచి క్రేజ్ వుంది. మరి అలాంటి క్రేజ్ నేపథ్యంలో ఇలాంటి సీన్, కథ అంటే కాస్త ఆసక్తికరమే.

ఆగస్టు 15న విడుదలవుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మడోన్నా నటిస్తోంది. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. టాప్ ఫొటోగ్రాఫర్ మణికందన్ సినిమాటోగ్రఫీ. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ. మరి మాంచి టెక్నికల్ సపోర్ట్ అందుతున్న ఈ సినిమాతో పరుశురామ్ బుజ్జి మళ్లీ హిట్ కొడతాడేమో చూడాలి.