వైఎస్ జయంతికి యాత్ర టీజర్

చకచకా షూటింగ్ జరుపుకుంటోంది వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ ‘యాత్ర’. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడో వచ్చింది. ఇప్పుడు టీజర్ కూడా రాబోతోంది. వైఎస్ జయంతి అయిన జూలై 8న కానీ, లేదా…

చకచకా షూటింగ్ జరుపుకుంటోంది వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ ‘యాత్ర’. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడో వచ్చింది. ఇప్పుడు టీజర్ కూడా రాబోతోంది. వైఎస్ జయంతి అయిన జూలై 8న కానీ, లేదా ముందుగా 7న కానీ టీజర్ విడుదల చేసే ఏర్పాట్లలో వున్నారు నిర్మాతలు.

రంగస్థలం సినిమాతో మాంచి పేరు తెచ్చుకున్న ఆర్ట్ డైరక్టర్ రామకృష్ణ యాత్ర సినిమా కోసం సారథి స్టూడియోలో మాంచి సెట్ వేసారు. అందులో మమ్ముట్టి, ఇతర నటులపై చకచకా షూటింగ్ సాగిస్తున్నారు.

ఇదిలా వుంటే యాత్ర సినిమాకు ఎడిటర్ గా పని చేసేందుకు శ్రీకర్ ప్రసాద్ ఓకె అన్నారు. అనేక జాతీయ అవార్డులు అందుకున్న శ్రీకరప్రసాద్ ప్రతిష్టాత్మక సినిమాలకే ఎక్కువగా పని చేస్తుంటారు.

అదే విధంగా యాత్ర సినిమాలో పాటలు అన్నీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాస్తున్నారు. సినిమాకు టెక్నికల్ టీమ్ ఎక్కడా తగ్గకుండా చూసుకుంటున్నారు. ఇప్పటికే సినిమాటోగ్రాఫర్ గా సత్య సూరియన్ (ఖాకీ, మాయ సినిమాల ఫేమ్), మ్యూజిక్ డైరక్టర్ గా కే (ఘాజీ, ఆనందో బ్రహ్మ) పని చేస్తున్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికి విడుదల చేయాలనే సంకల్పంతో యాత్ర సినిమాను చకచకా షూట్ చేస్తున్నారు. ముందుగా ఇన్ డోర్ సీన్లు అయిపోతే, పాదయాత్ర సీన్న కోసం అవుట్ డోర్ కువెళ్తారు.