గిల్డ్ పెద్దల వింత వాదన?

యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అంటూ ఒకటి ఏర్పాటుచేసుకున్నారు టాలీవుడ్ నిర్మాతలు కొందరు కలిసి. విడుదల డేట్ లు అవీ క్లాష్ కాకుండా చూసుకోవడం, సమస్యలు వస్తే కూర్చుని పరిష్కరించుకోవడం వంటివి గిల్డ్ బాధ్యతలు. గిల్డ్…

యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అంటూ ఒకటి ఏర్పాటుచేసుకున్నారు టాలీవుడ్ నిర్మాతలు కొందరు కలిసి. విడుదల డేట్ లు అవీ క్లాష్ కాకుండా చూసుకోవడం, సమస్యలు వస్తే కూర్చుని పరిష్కరించుకోవడం వంటివి గిల్డ్ బాధ్యతలు. గిల్డ్ లో పెద్దలుగా చాలా మంది వున్నారు. గీతా సంస్థ అరవింద్ కూడా వున్నారు.

ఆ మధ్య అలవైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాల విషయంలో దిల్ రాజు వంటి గిల్డ్ పెద్దలు అంతా కీలకంగా వ్యవహారించారు. ఇలాంటి నేపథ్యంలో ఈ నెల 25న నాని 'వి', రాజ్ తరుణ్ 'ఒరేయ్ బుజ్జిగా' సినిమాలు విడుదలవుతున్నాయి. ఇప్పుడు వున్నట్లుండి మరో చిన్న సినిమా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' చటుక్కున రంగంలోకి దిగింది.

వాస్తవానికి ఈ సినిమా ఎప్పటి నుంచో విడుదల డేట్ కోసం చూస్తోంది. ఇప్పుడు ఈ సినిమా విడుదల బాధ్యతలను గీతా2-యువి సంస్థ కలిసి తీసుకున్నాయి. ఇలా తీసుకుని, చటుక్కున గిల్డ్ లో ఎటువంటి డిస్కషన్ లేకుండానే 25న విడుదల అంటూ ప్రకటించేసారు.  దిల్ రాజు వి సినిమాకు సమస్య లేదు. ఎందుకంటే అది పెద్ద సినిమా. కానీ అదే రోజు రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా వుంది. 

ఇప్పుడు ఆ సినిమా నిర్మాతకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. గిల్డ్  వుంది కదా, ఇలా చేయడం ఏమిటి అంటే చిన్న సినిమాలు రెండు రావచ్చు అని కొత్త రూలు చెబుతున్నట్లు తెలుస్తోంది. పెద్ద సినిమాలు రెండు క్లాష్ కాకూదట. కానీ చిన్న సినిమాలు రెండు కొట్టేసుకోవచ్చట. అసలే థియేటర్లు భోరు మంటున్నాయి. మొన్న మూడు సినిమాలు విడుదలయితే, దేనికీ కలెక్షన్లు లేవు. 

గిల్డ్ అన్నది పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాలు కూడా క్లాష్ కాకుండా చూడాలి. నిజానికి చిన్న సినిమాలకే గిల్డ్ సాయం ఎక్కువ కావాలి. కానీ గిల్డ్ పెద్దలే డిస్ట్రిబ్యూషన్ తీసుకుని, 25న వేస్తుంటే ఇంకేం అనగలరు 'ఒరేయ్ బుజ్జిగా' నిర్మాత. గిల్డ్ అయినా మరోటి అయినా పెద్దలకు అనుకూలంగానే వుంటాయేమో?

పరిశ్రమ పరువు తీసేది కాదు, పరువు పెంచేది ఈ సినిమా