Advertisement

Advertisement


Home > Politics - Gossip

గరిష్టంగా ఏకగ్రీవాలే!

గరిష్టంగా ఏకగ్రీవాలే!

రాబోయే స్థానికసంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ప్రభజనం స్పష్టంగా కనిపిస్తుందనే అంచనాలు సాగుతున్నాయి. ప్రత్యేకించి పంచాయతీలలో సర్పంచి ఎన్నిక ఏకగ్రీవం అయితే.. ఆ పంచాయతీలకు ప్రోత్సాహకంగా లక్షల్లో నిధులు మంజూరవుతాయి. నిజం చెప్పాలంటే.. ఈ ప్రోత్సాహక నిధులే.. ఆయా పంచాయతీలో ఒకమేర అభివృద్ధి పనులను సమగ్రంగా చేపట్టడానికి కూడా ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో కూడా అనేకం ఏకగ్రీవం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

సాధారణంగా ప్రభుత్వం పంచాయతీల్లో ఎన్నికల పోటీలు, వైషమ్యాలు, విభేదాలు లేకుండా ఉండేందుకు సర్పంచి ఎన్నికలు ఏకగ్రీవం కావడాన్ని ప్రోత్సహిస్తుంటుంది. అందుకే పంచాయతీ ఎన్నికలను పార్టీ రహితంగా కూడా నిర్వహిస్తున్నారు. పార్టీల ప్రతిష్టలు, వ్యక్తుల విభేదాలు పక్కన పెట్టుకుంటే.. ఏకగ్రీవాల పుణ్యమాని పంచాయతీలు సులువుగా ప్రగతి బాటపట్టే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రోత్సాహకాల మీది ఆశతోనే కాకపోయినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం  వివిధ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏకగ్రీవ ఎన్నికలే ఎక్కువగా జరిగే అవకాశం కనిపిస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ను ప్రకటించిన ఎన్నికల కమిషనర్ కూడా పంచాయతీల ఏకగ్రీవాలను ప్రోత్సహించేలా మాట్లాడారు. అలాగని బలవంతపు ఏకగ్రీవాలు జరుగుతున్నట్లుగా తెలిస్తే కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా, పల్లెల స్థాయిలో చాలా పెద్దఎత్తున అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కలిసి.. ఏకగ్రీవాలే ఎక్కువగా జరగడానికి అవకాశం ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు.

గత ఏడాదిలో తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరిగాయి. పంచాయతీ సర్పంచి ఎన్నిక ఏగ్రీవం అయితే పది లక్షల రూపాయల ప్రోత్సాహకం ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. దానికి అదనంగా ఏకగ్రీవ పంచాయతీలకు తలా అయిదు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి నిధుల నుంచి ఇస్తాం అంటూ కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ స్ఫూర్తితో చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. ఏకగ్రీవం అయ్యే పంచాయతీలకు తమ ఎమ్మెల్యే నిధుల నుంచి కూడా అయిదు లక్షల వంతున ఇస్తాం అంటూ.. హామీలు గుప్పించారు. దాంతో ఏకగ్రీవాలు పెద్దసంఖ్యలో జరిగాయి.

అదేతరహా.. ఇప్పుడు ఏపీలో కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంది. పార్టీల ముద్ర లేని ఎన్నికల్లో పంచాయతీల్లోని ప్రజలు తమ విబేదాలను పక్కనపెట్టి ఐక్యంగా ఉంటే.. ప్రోత్సాహకంగా వచ్చే నిధులు పంట దక్కుతుంది.

పరిశ్రమ పరువు తీసేది కాదు, పరువు పెంచేది ఈ సినిమా

వీడు మా అమ్మ నాన్న కంటే బాగా చూసుకున్నాడు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?