ఏ రాజకీయ పార్టీకైనా పునాదులు బలంగా ఉంటే దీర్ఘకాలం ఆయుష్షు ఉంటుంది. గతంలో కాంగ్రెస్ అయినా తరువాత తెలుగుదేశం అయినా క్షేత్ర స్థాయిలో గట్టి నాయకత్వంతో మనుగడ సాగించాలి. వైసీపీ కూడా ఇపుడు ఆ రూట్లో పునాదులను పదిలపరచుకోవాలనుకుంటోంది.
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల బంపర్ మెజారిటీ మ్యాజిక్ ని రిపీట్ చేయాలనుకుంటోంది. ఉత్తరాంధ్రాలో మొత్తం 34 అసెంబ్లీ, అయిదు పార్లమెంట్ సీట్లు ఉంటే 28 అసెంబ్లీ, నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుని అజేయంగా ఉన్న వైసీపీ మళ్ళీ నాటి సత్తాను చూపించాలనుకుంటోంది.
మొత్తానికి మొత్తం అన్ని సీట్లు గెలుచుకోవడమే టార్గెట్ అంటున్నారు వైసీపీ ఉత్తరాంధ్రా జిల్లాల ఇంచార్జి విజయసాయిరెడ్డి. ఈ ప్రాంతమంతా వైసీపీకి మద్దతుగా ఉంది. దాంతో క్లీన్ స్వీప్ చేయాల్సిందే. గతంలో చేజారిన అరడజన్ ఎమ్మెల్యే సీట్లు కూడా గెలిపించుకోవాల్సిందేనని కూడా ఆయన స్పష్టంగా చెబుతున్నారు.
జగన్ పాతికేళ్ళ పాటు సీఎం గా ఉండాలంటే లోకల్ బాడీ ఎన్నికల్లో గెలుపు అవసరం. అది సాధ్యపడుతుంది. ఎందుకంటే విపక్షమే మనకు లేదు అంటున్నారు. విశాఖకు రాజధాని రానీయకుండా అభివ్రుద్ధిని అడ్డుకుంటున్న టీడీపీ నేతలకు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ఆయన అంటున్నారు.