ఏ డైరక్టర్ అయినా అడ్వాన్స్ గా చెక్కు తీసుకుంటారు. లేదా క్యాష్ తీసుకుంటారు. కానీ ఆ డైరక్టర్ యాభై లక్షల వర్త్ బంగారం తీసుకున్నారని బోగట్టా.
చిన్నా చితక సినిమాలు తీస్తూ, ఓ మీడియం సినిమాతో భారీ హిట్ కొట్టేసాడు ఆ డైరక్టర్ . దాంతో నక్క తొక తొక్కినట్లయింది ఓ పెద్ద సినిమా చేతిలో పడింది.
మామూలుగానే ఇవ్వని వాళ్లది పాపం అన్నట్లు అడ్వాన్స్ లు తీసుకుంటాడు అని పేరు. ఈ మధ్య వైకాపాతో రాజకీయ బంధాలుున్న ఓ ఔత్సాహిక నిర్మాత కోటి రూపాయల అడ్వాన్స్ చేతిలో పెట్టాడు.
దాని సంగతి సరే, మా ఫ్యామిలీకి కావాలంటూ ఓ యాభై లక్షల విలువైన బంగారం కూడా కొనిపించేసాడట. అది అడ్వాన్స్. ఇది సినిమా చేసినపుడు అడ్జస్ట్ చేసుకుందాం అని చెప్పాడట.
సరే, అలాగే కానీ ఆ కాబోయే నిర్మాత యాభై లక్షల బంగారం సమర్పించుకున్నట్లు తెలుస్తోంది. చాలా అడ్వాన్స్ లు వున్నాయి కాబట్టి ఇంతకీ ఈ నిర్మాత వంతు ఎప్పుడు వస్తుందో?