ఒక్క దెబ్బకు వందల ఎకరాలు మాయం చేశారు…

సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం సింహాచలంలో దేవాదాయ శాఖకు సంబంధించిన వందలాది ఎకరాలు మాయం అయిన మాట నిజమేనని దేవాదాయ శాఖ నియమించిన కమిటీ తాజాగా నిర్ధారించింది. సింహగిరి చుట్టూ విలువైన భూములు చాలా ఉన్నాయి.…

సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం సింహాచలంలో దేవాదాయ శాఖకు సంబంధించిన వందలాది ఎకరాలు మాయం అయిన మాట నిజమేనని దేవాదాయ శాఖ నియమించిన కమిటీ తాజాగా నిర్ధారించింది. సింహగిరి చుట్టూ విలువైన భూములు చాలా ఉన్నాయి. వీటిని చాప చుట్టేసినట్లుగా చుట్టేశారు.

ఇక గతంలో పనిచేసిన అధికారి ఒకరు ఏకంగా 748 ఎకరాలను రికార్డుల నుంచి తప్పించేశారు అన్నది కూడా కమిటీ గుర్తించిన్నట్లుగా సమాచారం. వీటి విలువ వేల కోట్ల రూపాయలు ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు.

కేవలం ఇద్దరు ఉన్నతాధికారుల సంతకాలతో వందల ఎకరాలను రికార్డుల నుంచి తప్పించేశారని తెలుసుకుని కమిటీ సభ్యులే విస్తుపోవాల్సిన పరిస్థితి ఉంది. దీని వెనక సూత్రధారులు ఎవరు అన్న దాని మీద కమిటీ విచారణ జరుపుతోంది.

మరో వైపు చూస్తే మాన్సాస్ ట్రస్ట్ కి చెందిన 150 ఎకరాల భూములు కూడా విక్రయించినట్లుగా కమిటీ గుర్తించినట్లుగా చెబుతున్నారు. మరికొంత భూమిని పక్కదారి పట్టించినట్లుగా కూడా విచారణలో తెలుస్తోంది. 

మొత్తం మీద చూసుకుంటే పెద్ద ఎత్తున భూ దందా సాగినట్లుగా కమిటీ అయితే నిర్ధారణకు వచ్చింది. ఈ నివేదికను ప్రభుత్వానికి త్వరలో అందిస్తారు అని చెబుతున్నారు. అది కనుక వస్తే అపుడు సంచలన నిర్ణయమే తీసుకుంటారని అంటున్నారు.