ఐ సినిమా విడుదల తేదీ మొత్తానికి ఫిక్సయింది. 14న వస్తున్నట్లు తేలిపోయింది. ఇప్పుడు గోపాల గోపాల సంగతి తేలాలి. ఇన్నాళ్లు 14న వస్తున్నట్లు అనుకుంటున్నారు. మరి కాస్త ముందుకు తెస్తారా అన్నిది ఇప్పుడు డౌట్. ఇక్కడ రెండువిధాల ఆలోచనలు సాగుతున్నాయని వినికిడి. 9న విడుదల చేస్తే, ఒక వారం సోలోగా కలెక్షన్ల రాబట్టుకుని, పండుగ కలెక్షన్లు మరో వారం దున్నకోవచ్చు.
ఎందుకంటే పండుగకు కనీసం రెండుమూడు సినిమాలు వున్నా సరిపోవు ఆంధ్రలో. అయితే తీరా 9న విడుదలై, పొరపాటునో, గ్రహపాటునో సీన్ రివర్స్ అయితే 14 నుంచి ఐ ముందు నిలబడ్డం కష్టమవుతుందని మరో టాక్ అని తెలుస్తోంది. అందుకే ఎప్పుడు విడుదల చేయడం అన్నదాని కన్నా ఎన్ని ఎక్కువ స్క్రీన్లలో విడుదల చేయడం అన్నది కీలకం అన్న దానిపై సురేష్ బాబు దృష్టి పెట్టారని తెలుస్తోంది.
మాగ్జిమమ్ స్క్రీన్ ల లో విడుదల చేసేందుకు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ ప్రారంభించేసారని తెలుస్తోంది. అయితే అవతలా చిన్న పార్టీ కాదు. సీడెడ్ లో ఎన్ వి ప్రసాద్ కు బాగా థియేటర్లు వున్నాయి.ఆంధ్రలో కాస్త మేనేజ్ చేయగలిగితే చాలు.