స్వంత ఊరికి ఆహుతి ప్రసాద్?

నటుడు ఆహుతి ప్రసాద్ స్కిన్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే కుటుంబ సభ్యులు ఎవరికీ ఏ విషయమూ చెప్పకుండా, వీలయినంతవరకు ఆయనను ప్రశాంతంగా వుంచుతున్నారు. ఇప్పుడు ఇదే పనిలో భాగంగా ఆయనకు…

నటుడు ఆహుతి ప్రసాద్ స్కిన్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే కుటుంబ సభ్యులు ఎవరికీ ఏ విషయమూ చెప్పకుండా, వీలయినంతవరకు ఆయనను ప్రశాంతంగా వుంచుతున్నారు. ఇప్పుడు ఇదే పనిలో భాగంగా ఆయనకు మరింత ఏకాంతంగా, ప్రశాంతంగా వుండేందుకు వీలుగా, ఆయన స్వగ్రామానికి తరలించినట్లు తెలుస్తోంది. 

ఆహుతి ప్రసాద్ స్వగ్రామం కృష్ణా జిల్లాలోని ముదినేపల్లి సమీపంలో వున్న కోడూరు. బంధువులను, స్నేహితులను కూడా కలవడానికి ఆయన పెద్దగా ఇష్టపడడం లేదని, కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే గడిపేందుకు ఇష్టపడుతున్నారని తెలుస్తోంది. అందుకే ఇక్కడ వుంటే, ఎవరో ఒకరు వస్తారని, అక్కడకు వెళ్లాళని ప్రసాదే కోరారని తెలుస్తోంది.