చిరు సజెషన్ వికటించిందా?

మెగా కుటుంబంలో ఎవరికైనా పెద్ద దిక్కు చిరంజీవే. ఇప్పుడు నాగేంద్రబాబు కుమారుడు వరుణ్ తేజ సినిమా ఫైనల్ వ్యవహారాల్లో కూడా ఆయనదే సలహా, సూచన కూడా. తొలి సినిమాకు పూరి, వివి వినాయక్, బోయపాటి…

మెగా కుటుంబంలో ఎవరికైనా పెద్ద దిక్కు చిరంజీవే. ఇప్పుడు నాగేంద్రబాబు కుమారుడు వరుణ్ తేజ సినిమా ఫైనల్ వ్యవహారాల్లో కూడా ఆయనదే సలహా, సూచన కూడా. తొలి సినిమాకు పూరి, వివి వినాయక్, బోయపాటి లాంటి కమర్షియల్ డైరక్టర్లను కాకుండా అడ్డాల శ్రీకాంత్ తో ఫిక్స్ చేసింది కూడా చిరంజీవే అని తెలుస్తోంది,.

వరుణ్ సందేశ్ లాంటి అప్ కమింగ్ హీరోతో వైవిధ్యమైన యూత్ ఫిలిం తీసాడు, మహేష్-వెంకీతో మాంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ మూవీ తీసాడు, అని చెప్పి శ్రీకాంత్ ను ఎంపిక చేసాడట. స్క్రిప్ట్, ఇతరత్రా విషయాలన్నీ నాగబాబు కన్నా చిరంజీవే ఎక్కువ చూసినట్లు టాలీవుడ్ టాక్. 

ఎందుకంటే ఇక్కడ నాగబాబుకు వేరే చాయిస్ లేదు..పైగా చిరు అంత సెలక్షన్ రాదు. అందుకే అటుభారం వేసాడు. కానీ ఇప్పుడు అది వికటించింది. నారా రోహిత్ చేసే వైవిధ్యమైన చిన్న సినిమాలకు పనికివచ్చే కథను తీసుకుని,మాస్ సినిమాగా మార్చి చేద్దామనుకుని, అందులో తన వైవిధ్యం చూపించాలనుకుని తాపత్రయ పడి సినిమాను ఎటూ కాకుండా చేసాడు శ్రీకాంత్. 

మెగా స్టార్ క్యాంప్ నుంచి వస్తున్న హీరోను అన్ని విధాలా ఆల్ రౌండర్ గా చూపించాలన్న సంగతే విస్మరించాడు. సరైన డాన్స్ లకు అవకాశం ఇవ్వలేదు. పైగా 20 కోట్ల బడ్జెట్ ఖర్చు చేయించారు. పండుగకు వచ్చి వుంటే వేరేగా వుండేది. ఆ ఊపులో కాస్త కలెక్షన్లు నొల్లేసేది. ఇప్పుడు ఆదికి ముందే వచ్చి, బయ్యర్ల భవిష్యత్ ను డోలాయమానంలో పడేసింది.