గోపాల గోపాల…సురేష్ బాబు, శరద్ మురార్ కలిసి, ఇటు వెంకీ అటు పవన్ తో కలపి నిర్మిస్తున్న ఓ మై గాడ్ రీ మేక్. ఇప్పుడు ఈ సినిమా టాక్ ఆప్ ది టాలీవుడ్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి కాస్త వర్క్ బకాయి వుందని తెలుస్తోంది. సంక్రాంతికి విడుదల చేద్దామని నిర్మాత సురేష్ బాబు ముందే డిసైడ్ అయిపోయారు.
అయితే ఇప్పుడు సంక్రాంతికి ఐ సినిమా విడుదలవుతోంది. దానికి పోటీగా గోపాల గోపాల విడుదల చేయడమా? మానడమా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. విడుదల చేయకుంటే రెండు సమస్యలు. ఒకటి వెనకడుగు వేసారంటారు..రెండవది మంచి సీజన్ మిస్ అవుతారు. అందుకే సురేష్ ఏ నిర్ణయం తీసుకుంటారా అని మిగిలిన నిర్మాతలు చూస్తున్నారు.
వాళ్లలో జెమిని కిరణ్ ఒకరు. ఆయన రామోజీ రావుతో కలిసి నిర్మించిన బీరువా విడుదలకు రెడీగా వుంది. ఒకవేళ గోపాల గోపాల రాదంటే, ఆ థియేటర్లను తీసుకుని, బీరువా విడుదల చేయాలనుకుంటున్నారు. అలాగే కళ్యాణ్ రామ్ కూడా. గోపాల గోపాల రాకుంటే తన సినిమా పటాస్ ను సంక్రాంతికి తేవాలనుకుంటున్నారు. ఇప్పటికైతే సంక్రాంతి తరువాతి అని అనుకుంటున్నారు. ఇలా గోపాల గోపాల తేదీ పై చాలా మంది ఎదురు చూస్తున్నారు. కానీ సురేష్ బాబు ఏ సంగతి పైకి చెప్పడం లేదు.