కుటుంబం మొత్తాన్ని థియేటర్లకు రప్పించే సత్తా ఉన్న కథానాయకుడు మహేష్ బాబు. ఎంత ఫ్యామిలీ స్టార్ అయినా… తన బలం మాసే. ఒక్కడు, పోకిరి, దూకుడు… ఈ బ్లాక్‌బ్లస్టర్ విజయాల వెనుక మాస్ ఉన్నారు. అతడు, సీతమ్మ వాకిట్లో.. క్లాస్ చిత్రాలు. హిట్టయినా భారీ వసూళ్లు సాధించలేకపోయాయి. అంటే.. మహేష్ బలం మాస్‌ని మెప్పించడం.
అయితే ఇప్పుడు మాస్‌కి దూరంగా ఉండే కథల్ని ఎంచుకోవడం అభిమానుల్ని విస్మయ పరుస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు మహేష్. ఇది ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కథ. రెండు కుటుంబాల మధ్య నడిచే డ్రామా. ఆగడు తరవాత మహేష్ క్లాస్ అండ్ ఫ్యామిలీ స్టోరీని ఎంచుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ తరవాత కూడా.. మహేష్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న స్టోరీనే ఎంచుకొన్నాడు.
కొరటాల శివ తరవాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నటించనున్నాడు మహేష్. ఈ సినిమాకి బ్రహ్మోత్సవం అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇదీ ఫ్యామిలీ డ్రామానే. అంటే బ్యాక్ టు బ్యాక్ ఫ్యామిలీ స్టోరీస్‌తో రాబోతున్నాడన్నమాట. కుటుంబ కథల్ని ఎంచుకోవడం మంచిదే. కానీ వరుసగా అవే కథల్లో కనిపించడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటో అర్థం కావడంలేదు. ఫ్యామిలీ స్టోరీస్ అయితే రిస్క్ ఉండదని భావిస్తున్నాడేమో…?! కానీ మాస్ మాటేంటి అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.