టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ చాలామందే ఉన్నారు. ప్రభాస్, రానా, నితిన్, మనోజ్… ఇలా రాసుకొంటూ పోతే చాంతాడంత జాబితా తయారవుతుంది. అందులో నిఖిల్ కూడా ఉన్నాడు. స్వామి రారా, కార్తికేయలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. కెరీర్ మాంఛి స్పీడు మీద ఉంది.
అందుకే లైఫ్లో కూడా సెటిల్ అవుదామన్న నిర్ణయం తీసుకొన్నాడట. త్వరలో ఓ మంచి శుభవార్త చెబుతా… అంటూ నిఖిల్ సోషల్ నెట్ వర్క్ మీడియాలో ఓ పోస్టింగ్ పెట్టాడు. అది నిఖిల్ పెళ్లి గురించే అని.. అందరి అనుమానం.
ఈమధ్యే ఆది వివాహం కూడా అయిపోయింది. ఇప్పుడు నిఖిల్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడన్నమాట. నిఖిల్ ది ప్రేమ వివాహం అయ్యే ఛాన్స్ ఉందని సన్నిహితులు చెబుతున్నారు. మరి నిఖిల్ ఎలాంటి షాకింగ్ వార్త చెబుతాడో…??