మెగా కుర్రాడు వరుణ్‌తేజ తొలి చిత్రం ‘ముకుంద’తో ఫర్వాలేదన్పించాడు. పోటీ సినిమాలేవీ లేకపోవడంతో ఇంకో వారం పదిరోజులు ‘ముకుంద’ వసూళ్ళకు పెద్దగా డోకా వుండకపోవచ్చు. ‘చిన్నదాన నీకోసం’ ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ రాబట్టుకోలేకపోవడంతో, వున్నంతలో ‘ముకుంద’కే ఓటేస్తున్నారు ఆడియన్స్.
ఇక, సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నానంటోన్న వరుణ్‌తేజ, ఇంకా ఉత్సాహంగా మీడియా ముందుకొచ్చి, సినిమా ప్రమోషన్ పనుల్లో బిజీ అవనున్నాడట. షరామామూలుగానే వరుణ్‌తేజ ముందుకు ‘సిక్స్ ప్యాక్ ఎప్పుడు?’ అన్న ప్రశ్న వస్తోంది. షర్ట్ విప్పి, సిక్స్ ప్యాక్ చూపించే రోజొస్తుంది.. అయితే దానికి తగ్గ కథ దొరకాలి కదా.. అంటున్నాడు వరుణ్ తేజ.
మెగా ఫ్యామిలీ నుంచి ఆల్రెడీ అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ చూపించేశాడు. తెలుగులో సిక్స్ ప్యాక్ ఫీవర్ షురూ చేసింది అల్లు అర్జునే. చరణ్ కూడా సిక్స్ ప్యాక్ యాబ్స్ కలిగి వున్నా, అప్పుడే చూపించబోనంటున్నాడు. మరి, వరుణ్ తదుపరి సినిమాకే సిక్స్ ప్యాక్ చూపించేస్తాడా.? ఏమో మరి, సిక్స్ ప్యాక్ ఫీవర్ నడుస్తోంది గనుక, వరుణ్ ఆ దిశగా ట్రై చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
అన్నట్టు, మెగా మేనల్లుడు సాయిధరమ్తేజకి సిక్స్ ప్యాక్ వున్నా, ‘పిల్లా నువ్వు లేని జీవితం’లో చూపించలేదు. తొలి చిత్రం ‘రేయ్’లో సాయిధరమ్ సిక్స్ ప్యాక్ చూపించాడన్న ప్రచారమైతే జరిగిందిగానీ, ఆ సినిమా ఇంకా విడుదలకు నోచుకోని విషయం విదితమే.