ఎంపీలకు ఏమీ అధికారాలు లేవని, అధికారులు మాట వినడం లేదని ఎంపీ కేశినేని నాని వాపోయారు.చిత్రంగా మర్నాడే తెలంగాణ సిఎమ్ కెసిఆర్ తన రాష్ట్ర ఎంపీలకు బోలెడు తాయిలాలు ప్రకటించారు. ప్రతి నెల కన్వేయెన్స్ కింద యాభై వేలు ఇవ్వాలని కేసిఆర్ డిసైడ్ చేసారు.సెక్యూరిటి కారు అలవెన్సులు ఇవ్వాలని డిసైడ్ చేసారు.
Advertisement
నిజానికి ఎంపీలకు కేంద్రం బోలెడు జీత భత్యాలు ఇస్తుంది. నియోజకవర్గ అలవెన్సు, పిఎ అలవెన్సు, ఫోన్ బిల్లు ఇలా చాలా వున్నాయి. అయినా కెసిఆర్ ఉదారంగా కొత్త వరాలు ప్రకటించారు. కానివ్వండి..చేసేదేముంది. జనం కష్టపడి సంపాదించి పన్నులు కడుతున్నది ఎందుకోసం,.ఇందుకోసమేగా..