Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

గోపీచంద్‌ సరసన రెజీనా

గోపీచంద్‌ సరసన రెజీనా

‘యజ్ఞం’ రవికుమార్‌ చౌదరి ఇటీవలే ‘పిల్లా నువ్వు లేని జీవితం’తో పెద్ద హిట్‌ కొట్టిన విషయం విదితమే. తాజాగా గోపీచంద్‌తో సినిమా తెరకెక్కించనున్నాడు రవికుమార్‌ చౌదరి. ‘యజ్ఞం’ తర్వాత గోపీచంద్‌తో చేస్తున్న ఈ సినిమాని రవికుమార్‌ చౌదరి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాడట.

‘పిల్లా నువ్వు లేని జీవితం’ ఫేం రెజినాకి గోపీచంద్‌తో తెరకెక్కిస్తున్న సినిమాలో రవికుమార్‌ చౌదరి హీరోయిన్‌గా ఛాన్సిచ్చినట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లో యాక్షన్‌ విత్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే ఫార్ములాకి కాసుల పంట పండుతుండడంతో, రవికుమార్‌ చౌదరి, ఈ సినిమాని కూడా అదే ఫార్మాట్‌లో రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాని డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేతో రూపొందించిన రవికుమార్‌ చౌదరి, గోపీచంద్‌ సినిమాకీ అదే టెక్నిక్‌ ఫాలో అవనున్నట్లు సమాచారం.

ఇక, ‘పిల్లా నువ్వు లేని జీవితం’ హిట్‌ అయినా, ఆ తర్వాత అవకాశాల్ని అందిపుచ్చుకోవడంలో కాస్త అలసత్వం ప్రదర్శించిన రెజినా, ఇప్పుడిప్పుడే వరుస ఆఫర్లను దక్కించుకుంటోంది. అన్నట్టు గోపీచంద్‌, రెజినా, రవికుమార్‌ చౌదరి కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమా ఈ నెల 15 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుందట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?