అక్టోబర్ 9 కు వెళ్లింది ఫైనల్ గా రుద్రమదేవి. రెండుకు వద్దామంటే తమిళ వెర్షన్ తో సమస్య. ఎందుకంటే 1న అక్కడ విజయ్ పులి వుంది. అంతకన్నా ముందు వారాల్లో వద్దామంటే దిల్ రాజు సినిమాతో సమస్య. ఇక 9 మాత్రమే మిగిలింది. ఇప్పటికి అయితే ఇది కూడా సరైన డేట్ కాదు.
ఎందుకంటే 15న బ్రూస్ లీ వచ్చే అవకాశాలు ఫిఫ్టీ..ఫిఫ్టీగా వున్నాయి. అది రాకుంటే ఓకె. రుద్రమదేవి గట్టెక్కేస్తుంది. అప్పటికీ 1న పులి, రెండున కంచె, సైజ్ జీరో వున్నాయి. శివం పేరు కూడా వినిపిస్తోంది కానీ, కాస్త అనుమానం. అందువల్ల 24 నుంచి వున్న విడుదలలతో లెక్కేసుకుంటే కనీసం మూడు నాలుగు సినిమాలు థియేటర్లలో వుండే అవకాశం వుంది.
అందువల్ల సరిపడా స్క్రీన్ లు దొరకడమే కష్టం. అలాంటిది 15న బ్రూస్ లీ వుంటే మరీ ప్రమాదం. అది లేకుంటే కనుక రెండు వారాలు గ్యాప్ దొరకుంతుంది అఖిల్ సినిమాకు బ్రూస్ లీకి నడుమ. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇరుక్కుంది రుద్రమదేవి. ఖాళీగా వున్న ఆగస్టును, సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ను వదిలేసి గుణశేఖర్ తప్పు చేసాడేమో.