బిబిఎమ్ కు 110 స్క్రీన్ లు అవసరమా?

భలే భలే మగాడివోయ్..నాని-మారుతి కాంబినేషన్ లో ఈ సినిమా ఓవర్ సీస్ పై కాస్త గట్టి ఆశలే పెంచుకున్నట్లు కనిపిస్తోంది. ఏకంగా 110 స్క్రీన్ ల్లో విడుదల చేస్తున్నారు. సినీ గెలక్సీ ప్లస్ దర్శకుడు…

భలే భలే మగాడివోయ్..నాని-మారుతి కాంబినేషన్ లో ఈ సినిమా ఓవర్ సీస్ పై కాస్త గట్టి ఆశలే పెంచుకున్నట్లు కనిపిస్తోంది. ఏకంగా 110 స్క్రీన్ ల్లో విడుదల చేస్తున్నారు. సినీ గెలక్సీ ప్లస్ దర్శకుడు మారుతి కలిసి ఈ పంపిణీ వ్యవహారాలను తీసుకున్నారు.

సినిమాకు మంచి హైప్ వచ్చింది. పాజిటివ్ బజ్ వుంది కానీ, ఓవర్ సీస్ లో ఈ రేంజ్ సినిమాకు 110 స్క్రీన్ లు అవసరమా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఓవర్ సీస్ లో అసలు సమస్య ఖర్చలే. ఆదాయం సంగతి అలా వుంచితే, ముందుగా ఖర్చులకు ప్రిపేర్ అయిపోవాలి. ఆదాయంలో 60 శాతం ఖర్చులే వుంటాయన్నది లెక్క.

మరి ఇలా ఎక్కువ స్క్రీన్ ల్లో విడుదల చేయడం వల్ల ఆదాయం నూరు శాతం లేకపోతే, ఖర్చులు 60 శాతం పోతే వచ్చేది తక్కువ వుంటుంది. పైగా చిన్న, మీడియం సినిమాలు అంటే ఓవర్ సీస్ జనాలు నెట్ కేసే ఆశగా చూస్తారు. ఎవరో ఒకరు లోడ్ చేయకపోతారా? డౌన్ లోడ్ పెట్టకపోతామా అని? మహా మహా పెద్ద సినిమాలే విడుదలయిన మూడు రోజుల్లో నెట్ లో ప్రత్యక్షమైపోతాయి.

పైగా మరో సమస్య ఏమిటంటే డైనమైట్. ఈ సినిమా కూడా ఓవర్ సీస్ లో భారీగానే విడుదల చేస్తున్నారు. ఇనీషియల్ గా 60వేల డాలర్లు ఇందుకోసం ఖర్చు చేసారని వినికిడి. అంటే కనీసం ఆ మొత్తం రికవరీ కావాలి. పైగా ఓవర్ సీస్ లో ఆదాయం వీకెండ్ ల్లోనే.

ఇలా వున్న వీకెండ్ ను రెండుసినిమాలు పంచుకుంటే వచ్చే ఆదాయం కాస్త థియేటర్ ఖర్చులకే సరిపోయే ప్రమాదం వుంది. ఆ తరువాత రివ్యూలు, మౌత్ టాక్ బట్టి, ముందుకు వెళ్లడం అన్నది వుంటుంది. ఏదయినా ఈ రెండు సినిమాలు ఓవర్ సీస్ లో చేస్తున్నది కాస్త రిస్క్ అనే చెప్పాలి.