‘గురు’డి కి పారితోషికం శాటిలైట్ నా?

గురు సినిమా వెంకీ కెరీర్ లో ఓ కొత్త చాప్టర్ అనుకొవాలి. దృశ్యం, గోపాల గోపాల లాంటి డిఫరెంట్ సినిమాలు చేస్తున్న వెంకీ గురు సినిమాతో కొత్తగా కనిపిచడమే కాదు, కొత్త తరహాగా స్పోర్ట్స్…

గురు సినిమా వెంకీ కెరీర్ లో ఓ కొత్త చాప్టర్ అనుకొవాలి. దృశ్యం, గోపాల గోపాల లాంటి డిఫరెంట్ సినిమాలు చేస్తున్న వెంకీ గురు సినిమాతో కొత్తగా కనిపిచడమే కాదు, కొత్త తరహాగా స్పోర్ట్స్ బేస్ సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాకు వెంకీ పారితోషికం ఏమిటి? అన్నది పాయింట్. 

ఈ సినిమాను తమిళ మాతృక నిర్మాతలే తెలుగులో కూడా నిర్మిస్తున్నారు. కేవలం ముఫై కాల్ షీట్లు మాత్రమే వెంకీ కేటాయించింది. ఈ సినిమాను చాలా వెల్ ఫ్లాన్డ్ గా తీస్తున్నారు. చాలా సన్నివేశాలు, ట్రాక్ లు అవ్నీ మాతృక నుంచి ఎక్కువగా తీసుకుంటున్నట్లు వినికిడి. స్పోర్స్ నేపథ్యంలో సినిమా కాబట్టి, ఫలితం ఎలా వుంటుదో అని అనుమానం. 

అందుకే బడ్జెట్ విషయంలో, మేకింగ్ విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో వెంకీ పారితోషికం ఎంతయి వుంటుంది? ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల సమాచారం ప్రకారం వెంకీ ఈ సినిమాకు పారితోషికం తీసుకోవడం లేదు. శాటిలైట్ హక్కులను మాత్రం తీసుకుంటున్నారు. 

అంటే ఎలా లేదన్నా అయిదు కోట్ల వరకు వుండే అవకాశం వుంటుంది. సినిమా హిట్ అయితే అది ఆరు దాటినా ఆశ్చర్యం లేదు. లేదూ అంటే  వెంకీ సోదరుడు సురేష్ బాబు ఏదో ఒకటి చేసి, అయిదు కు తగ్గకుండ అమ్మగలరు. అంటే వెంకీ పారితోషికం అయిదుకోట్లు అనుకోవాలి.