Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

‘హరిహర’ పై పవన్ అసంతృప్తి?

‘హరిహర’ పై పవన్ అసంతృప్తి?

హరిహర వీరమల్లు…పవన్ కళ్యాణ్..క్రిష్ కాంబినేషన్ లో నిర్మాత ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న సినిమా. పవన్ కెరీర్ లోనే ఇంత సుదీర్ఘంగా నిర్మాణంలో వున్న సినిమా మరోటి లేదేమో? ఏనాడో జమానా కాలం నాడు ఇచ్చిన అడ్వాన్స్. 

సినిమాల్లోకి మళ్లీ వచ్చిన తరువాత పవన్ స్టార్ట్ చేసిన సినిమా. ఈలోగా వకీల్ సాబ్, భీమ్లా నాయక్ రెండు సినిమాలు పూర్తయ్యాయి. విడుదలయ్యాయి. కానీ ఈ సినిమా మాత్రం నాలుగు అడుగులు వెనక్కు, రెండు అడుగులు ముందుకు అన్నట్లు సాగుతోంది. ఈ నెల 12న నుంచి జరగాల్సిన షెడ్యూల్ ను క్యాన్సిల్ కొట్టారు. రెండు భారీ సెట్లు అలా పడి వున్నాయి.

ఇదిలా వుంటే ఓ కొత్త గ్యాసిప్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. హరిహరవీరమల్లు సినిమా క్వాలిటీ మీద పవన్ అసంతృప్తిగా వున్నారు అన్నది ఆ గ్యాసిప్. షూట్ చేయాల్సిన సెట్ లు, కాస్ట్యూమ్స్ వగైరా విషయాలపై పవన్ నేరుగా క్రిష్ దగ్గరే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. చాలా లో క్వాలిటీ సెట్ లు, కాస్ట్యూమ్ లు వున్నాయని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.

అలాగే అదే సమయంలో తనకు చెప్పినదేమిటి? తీస్తున్నదేమిటి? అని క్రిష్ దగ్గర పవన్ అసంతృప్తి వ్యక్తం చేసారని వార్తలు వినిపిస్తున్నాయి. చూస్తుంటే ఈ సినిమా ఈ ఏడాది విడుదల అవుతుందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

దసరాకు విడుదల అనుకున్నారు. కానీ ఇంకా చాలా వర్క్ వుంది. పైగా ఆంధ్రలో పొలిటికల్ యాక్టివిటీలు పెరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పవన్ సినిమాలకు సమయం కేటాయించాల్సి వుంది.

హరిహర వీరమల్లు ఓ కొలిక్కి వస్తే సముద్రఖని డైరక్షన్ లో సినిమాకు ఇరవై రోజులు సమయం ఇవ్వాలి. ఆపై హరీష్ శంకర్ సినిమా చేయాలి. హరీష్ శంకర్ సినిమా కోసం ఏళ్ల క్రితమే పవన్ అడ్వాన్స్ అందుకున్నారు. అలాగే సముద్రఖని సినిమా కోసం నెల క్రితమే అడ్వాన్స్ అందుకున్నారని బోగట్టా. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?