ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా టస్సెల్ విడిపోయినట్లు వార్తలు అందుతున్నాయి. హారిక హాసిని చినబాబు కు వరసకు కొడుకు అయిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ కోరిక మేరకు త్రివిక్రమ్ సై అనక తప్పలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ తో సినిమా చేయాలని నాగవంశీకి ఇంట్రెస్ట్ గా వుందని వినికిడి. అందుకే త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ తో సినిమా అంటూ చేస్తే, హారిక హాసిని బ్యానర్ పైనే అని చెప్పినట్లు తెలుస్తోంది.
ప్రియురాలి కోసం ప్రేమికుడు రివెంజ్ తీర్చుకోవడం అనే లైన్ ఆధారంగా అల్లిన కథను ఎన్టీఆర్ తో తెరకెక్కిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. లైన్ అంటే కొత్తది కాదని అనిపిస్తుంది కానీ, కథ, పాత్రలు, ట్రీట్ మెంట్ కొత్తగా వుంటాయట. పైగా త్రివిక్రమ్ మార్కు ఫ్యామిలీ ఫన్ అంతా వుంటుదట.
మహేష్ కోసం చెప్పిన లైన్ తండ్రీ కొడుకుల మధ్య నడిచే డ్రామా తో కూడిన కథ అని తెలుస్తోంది. మొత్తానికి ఎవరి కథను వారికి సెట్ చేసినట్లు, బ్యానర్ దగ్గర డిస్కషన్లు సాగుతున్నట్లు వినికిడి. సినిమా అంటూ చేస్తే, అది హారిక హాసిని బ్యానర్ పైనే అని త్రివిక్రమ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఎన్టీఆర్ వత్తిడినో, హ్యారికహాసిన వంశీ ఆసక్తినో, ఎన్టీఆర్ అభిమానులు త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా 2018లో చూడొచ్చేమో?