హీరో వరుణ్ తేజ్ తో డైరక్టర్ హరీష్ శంకర్ చేస్తున్న లేటెస్ట్ సినిమా వాల్మీకి. ఈ సినిమా విషయంలో నిర్మాతలకు-డైరక్టర్ కు మధ్య వచ్చిన సమస్యలు అన్నీ తొలగిపోయి, ఓ ఒప్పందం కుదిరినట్లు వినిపిస్తోంది. సినిమా ప్రారంభంలో లాభాల్లో వాటా అన్న ప్రాతిపదికన హరీష్ శంకర్ రంగంలోకి దిగారు. కానీ సినిమా మేకింగ్ కు అనుకున్నదాని కన్నా కాస్త గట్టిగానే ఖర్చయనట్లు తెలుస్తోంది.
దాదాపు ముఫైకోట్ల వరకు సినిమాకు ఖర్చయినట్లు తెలుస్తోంది. అది కూడా డైరక్టర్ రెమ్యూనిరేషన్ యాడ్ కాకుండానే. దాంతో నిర్మాతలు-దర్శకుడు వాటాల వ్యవహారం పక్కనపెట్టి, సెటిల్ మెంట్ కు కూర్చున్నట్లు తెలుస్తోంది. ఆఖరికి డైరక్టర్ హరీష్ శంకర్ కు ఏడుకోట్లు రెమ్యూనిరేషన్ ఇవ్వడానికి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
డిజె సినిమాకు హరీష్ శంకర్ ఎనిమిది కోట్ల వరకు తీసుకున్నారు. కానీ దాని స్పాన్, మార్కెట్ వేరు. ఇదిలావుంటే, తన రెమ్యూనిరేషన్ లోనే రెండున్నర కోట్లు ఖర్చుచేసి, హరీష్ శంకర్ ఉత్తరాంధ్రకు వాల్మీకి హక్కులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తీసుకుని, సినిమాను దిల్ రాజు దగ్గర డిస్ట్రిబ్యూషన్ కు వుంచారు. అంటే ఈ లెక్కన ఆంధ్ర 10 కోట్ల రేషియోలో ఇచ్చినట్లు అయింది.
నైజాం నుంచి 8 కోట్లు ఆశిస్తున్నారు కానీ, బయ్యర్ ముందు వెనుకలు ఆడుతుంటే, కోటి రూపాయల వరకు అదే నిర్మాతలు తరువాత తీసే శర్వానంద్ శ్రీకారం సినిమాకు అడ్వాన్స్ కింద హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే ఆ లెక్కన చూసుకుంటే ఆంధ్ర 10, నైజాం 7, అలాగే సీడెడ్, కర్ణాటక, ఓవర్ సీస్.
ఇతరత్రా అన్నీ కలుపుకుని దగ్గర దగ్గర పాతిక కోట్ల వరకు థియేటర్ హక్కుల రూపంలో రాబడుతున్నట్లు తెలుస్తోంది. బాడ్ డేట్, టఫ్ కాంపిటీషన్, అటు సాహో, ఇటు సైరా, అలా అన్ని విధాలా కాస్త టెన్షన్ లోనే విడుదలవుతున్న వాల్మీకి ఏ మేరకు వసూళ్లు సాగిస్తుందో చూడాలి.