Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హవీష్ తో లింగుస్వామి సినిమా

హవీష్ తో లింగుస్వామి సినిమా

హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా హీరో హవీష్ తన ప్రయత్నాలు తాను చేస్తూనే వున్నాడు. నిర్మాత ఎవరైనా వ్యవహారం హవీష్ దే. అయితే ఇప్పటి చేసిన సినిమాల విషయంలో డైరక్టర్లను ఎన్నుకొవడంలో తప్పు మీద తప్పు చేసుకుంటూ వస్తున్నాడు. సరైన డైరక్టర్ల చేతిలో పడడంలేదు. సినిమా చేయలేదు.

ఇప్పుడు ఆ విషయం గమనించి జాగ్రత్త తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. తమిళనాట మాస్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న లింగుస్వామి డైరక్షన్ లో హవీష్ సినిమా చేయబోతున్నాడు. లింగుస్వామి పేరు కొంత కాలంగా అల్లు అర్జున్ తో సినిమా అని వినిపిస్తోంది. కానీ అది గ్యాప్ తీసుకునేలా వుంది.

ఈ లోగా తెలుగు, తమిళ భాషల్లో, ఇరుభాషల నటులను కలిపి, ఓ ద్విభాషా చిత్రానికి లింగుస్వామి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంమీద ఈ సినిమాతో అయినా హవీష్ తనేంటో ప్రూవ్ చేసుకుని, హిట్ కొడతాడేమో.. చూద్దాం.

దాడులపై బాబు మౌనం.. ఓటమికి ఇది కూడా కారణమే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?