డబ్బులిచ్చేవరకు షూటింగ్ కు వెళ్లని హీరో!

తాను సినిమా చేస్తున్నది పెద్ద బ్యానర్ అని కూడా చూడలేదు. అనుకున్న పేమెంట్ ఇచ్చే వరకు కాలు బయట పెట్టలేదని తెలుస్తోంది.

 

ఈ మధ్య హీరోలకు అస్సలు మొహమాటం వుండడం లేదు. డబ్బులిస్తే తప్ప అడుగు కదపడం లేదు. ఇది హీరో కృష్ణ కాలం కాదు. నష్టపోయిన వారిని పిలిచి ఫ్రీగా సినిమా చేయడానికి. మీ బాధలు మాకు అనవసరం, మా రెమ్యూనిరేషన్ అక్కడ పెట్టండి అనే కాలం.

మొన్నామధ్య ఓ మాస్ హీరో డబ్బులు అక్కడ పెట్టే వరకు సినిమా షూట్ కు వెళ్లలేదని వార్తలు వచ్చాయి. చివరకు నిర్మాత ఫైనాన్స్ తీసుకుని హీరో రెమ్యూనిరేషన్ పంపితే తప్ప షూట్ కు రాలేదు.

ఇప్పుడు మరో మాస్ హీరో కూడా ఇదే బాటలో వెళ్లినట్లు తెలుస్తోంది. వరుస ఫ్లాపులతో బాధపడుతున్న సదరు హీరోతో సినిమా తీయడమే గొప్ప విషయం. పారితోషికం ఒక రోజు ముందు కావచ్చు, వెనక కావచ్చు. ఇస్తారని అనుకోలేదు. తాను సినిమా చేస్తున్నది పెద్ద బ్యానర్ అని కూడా చూడలేదు. అనుకున్న పేమెంట్ ఇచ్చే వరకు కాలు బయట పెట్టలేదని తెలుస్తోంది.

దాంతో నిర్మాణ సంస్థ అర్జంట్ గా అమౌంట్ అరేంజ్ చేసిందట. అప్పుడు సినిమా బ్యాలన్స్ వర్క్ కు, పోస్ట్ ప్రొడక్షన్ కు వచ్చాడట హీరో. ఏమైనా అంటే ఇది యాపారం అని అంటారేమో?

 

17 Replies to “డబ్బులిచ్చేవరకు షూటింగ్ కు వెళ్లని హీరో!”

  1. గోపీచంద్ లాగున్నాడే …. అయినా వెబ్సైట్ మీద డబ్బు రాకపోతే నువ్వేమైనా భుక్తిగా ఆర్టికల్స్ రాస్తావా . డబ్బులు లేకపోతే ఎక్కడా పనిజరగదు

  2. పోనీ నువ్వు ఫ్రీ గా చేస్తావా నువ్వు డబ్బు కోసమేగ పిచ్చి రాతలు రాస్తున్నావ్

  3. చావు బ్రతుకుల మధ్య ఉండే వారిని డబ్బు ముందు ఇస్తే గానీ కనీసం చూడని డాక్టర్ లు చాలా మందే ఉన్నారు.. అలాంటి రక్తం పీల్చే జలగలకన్నా ఈ ఆక్టర్ లు పాపం చాలా నయం…

Comments are closed.