Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హీరోను కాదని సునీల్ ను తప్పిస్తారా?

హీరోను కాదని సునీల్ ను తప్పిస్తారా?

అల్లరి నరేష్ కు మళ్లీ మరో మాంచి పాత్ర వచ్చేసిందని, రవితేజ డిస్కోరాజాలో చేయబోతున్నాడని, తెగ వార్తలు కట్ అండ్ పేస్ట్ అయిపోయాయి. కానీ వాస్తవం ఏమిటంటే ఆ సినిమాలో అల్లరి నరేష్ చేయడం లేదన్నది. ఇప్పటికీ ఇంకా ఆ పాత్ర కమెడియన్ కమ్ హీరో సునీల్ కే వుంది.

మహర్షి సినిమాలో అల్లరి నరేష్ కు కాస్త అప్లాజ్ రావడంతోనూ, అలాగే అరవింద సమేత, చిత్రలహరి సినిమాల్లో అంతగా క్లిక్ కాకపోవడతోనూ, డైరక్టర్ ఆనంద్ కొత్త నిర్ణయం తీసుకుంటారా? అన్న ఆలోచనలు మొగ్గతొడిగినట్లు బోగట్టా. అంతలోనే వార్తలు వచ్చేసాయి.

కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, హీరో రవితేజ పూర్తిగా సునీల్ వైపే వున్నారు. ఆయన సునీల్ అయితేనే ఆ పాత్రకు బాగుంటుందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. హీరోను, హీరో అభీష్టాన్ని కాదని దర్శకుడు ఆనంద్ మార్చడం కష్టం. పైగా ఈ సినిమా ఇప్పటికే రెండు అడుగులు ముందుకు, ఓ అడుగు వెనక్కు అన్నట్లు వుంది.

ఈ సినిమా ఎప్పుడు అయిపోతుందా? మళ్లీ నిఖిల్ తో సినిమా చేసి, తన అదృష్టం మరోసారి అక్కడే వెదుక్కుందామనే ఆలోచనలో వున్నారు ఆనంద్. ఇలాంటి నేపథ్యంలో స్టార్ కాస్ట్ మార్చడం, హీరోతో అనవసరపు తకరారు పెట్టుకోవడం అన్నది చేస్తారా? డౌటే.

ఈ రాజకీయ వారసుల భవితవ్యం ఏమిటి?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?