Advertisement

Advertisement


Home > Politics - Gossip

పవన్-నాగబాబు మధ్య విభేదాలు?

పవన్-నాగబాబు మధ్య విభేదాలు?

ఏరికోరి మరీ అన్నయ్య నాగబాబుకు సీటిచ్చారు పవన్. అలాంటి వ్యక్తితోనే నాగబాబు కయ్యం తెచ్చుకున్నారనే టాక్ వినిపిస్తోంది. వీళ్లిద్దరి మధ్య ఈ గ్యాప్ రావడానికి ప్రధాన కారణం జబర్దస్త్ అని తెలుస్తోంది. జబర్దస్త్ లో నాగబాబు రీఎంట్రీ ఇచ్చారు. టెంపరరీగా ఇద్దరు డ్యాన్స్ మాస్టర్లు ఆ తర్వాత అలీతో జరిగిన ఈ కార్యక్రమంలో వచ్చేవారం నుంచి పాత జోడీనే కనపడుతుంది. ఇటీవలే ఎమ్మెల్యే రోజా రీఎంట్రీ ఇవ్వగా.. తాజాగా నాగబాబు కూడా షూటింగ్ కి వచ్చేశారు.

వచ్చేవారం నుంచి రోజా-నాగబాబు కాంబినేషన్ మళ్లీ బుల్లితెరపైకి వస్తోంది. అయితే నాగబాబు రీఎంట్రీ వెనక పెద్ద సంఘర్షణే జరిగినట్టు సమాచారం. సినిమాలు వదిలేసి పూర్తిస్థాయిలో రాజకీయాల్లో కొనసాగుతున్నానని, నాగబాబు కూడా తనలానే అన్నీ వదిలేసి రాజకీయాల్లో కొనసాగాలని పవన్ భావించారు. కానీ పవన్ ఆలోచనతో నాగబాబు విభేధించినట్టు తెలుస్తోంది. తనకు డబ్బు, పాపులారిటీ తెచ్చిపెడుతున్న జబర్దస్త్ ను వదలడానికి నాగబాబు ఇష్టపడలేదు. అందుకే పవన్ ఇష్టానికి విరుద్ధంగా జబర్దస్త్ లోకి మరోసారి ఎంట్రీ ఇస్తున్నారు.

ఇటీవల పవన్ రివ్యూ మీటింగ్స్ కు నాగబాబు కూడా హాజరుకావడంతో.. తమ్ముడితో పాటు అన్న కూడా ఫుల్ టైమ్ పాలిటిక్స్ పై దృష్టిపెట్టాడేమో అనుకున్నారంతా. కానీ ఇదంతా తమ్ముడ్ని బుజ్జగించడం కోసమేనట. షూటింగ్ లకు వెళ్లినా రాజకీయాలను వదిలి వెళ్లనని చెప్పడం కోసమే నాగబాబు టైమ్ అడ్జస్ట్ చేసుకుని మరీ పవన్ తో రాజకీయ సమీక్షలకు వస్తున్నారు.

మొత్తమ్మీద పవన్ వద్దని వారించినా నాగబాబు జబర్దస్త్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ విషయంలో పవన్ ఇంకా మెత్తబడలేదట. నాగబాబు మాత్రం పవన్ తో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుపోతున్నారు.

ఈ రాజకీయ వారసుల భవితవ్యం ఏమిటి?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?