నిఖిల్ గౌడ. ఈపేరు ఒక్కసారిగా టాలీవుఢ్ లో విపరీతంగా వినిపించింది. మాజీ సిఎమ్ కుమారస్వామి కొడుకు. తండ్రి నిర్మాతగా తెలుగులో జాగ్వార్ అనే భారీ సినిమాకు శ్రీకారం చుట్టారు. వైజాగ్ రాజు, మరి కొందరు మిత్రులు టాలీవుడ్ లో విపరీతమైన హడావుడి చేసారు. లక్షలకు లక్షలు ప్రకటనలు గుప్పించారు. కుమారస్వామి స్వయంగా పార్క్ హయాత్ లో కూర్చుని సినిమా ప్రచారం నిర్వహించారు.
సినిమా విడుదలయింది. డిజాస్టర్ అయింది. అంతా గాయబ్. మీడియాల్లో కొన్ని సంస్థలకు లక్షల్లో బాకీలు మాత్రం మిగిలాయి. అప్పటి వరకు హల్ చల్ చేసిన వారంతా తమకు తెలియదు, తమకు తెలియదు అని మొహం చాటేసారు. కుమారస్వామి ఆ తరువాత సిఎమ్ అయిపోయారు. ఆ తరువాత మళ్లీ మాజీ అయిపోయారు. బాకీలు అలాగే వున్నాయి.
ఇప్పుడు అదే నిఖిల్ గౌడ మళ్లీ తెలుగు సినిమా, తెలుగు డైరక్టర్ తో చేయబోతున్నారు. కొండా విజయ్ కుమార్ డైరక్షన్ లో బాస్కెట్ బాల్ క్రీడ నేఫథ్యంలో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆదిత్య మ్యూజిక్ మాదిరిగానే లహరి మ్యూజిక్ సంస్థ కూడా సినిమా నిర్మాణంలోకి దిగుతోంది. ఆ సంస్థనే ఈ సినిమాను నిర్మించబోతోంది.
మరి ఇప్పుడు మరోసారి కుమారస్వామి కోటరీ అయిన టాలీవుడ్ జనాలు మరోసారి హల్ చల్ చేస్తారో? పాత బాకీలు అడుగుతారని సైలంట్ గా వుంటారో?మరి?