అయ్య బాబోయ్.. ఇంత ఆవేశం ఏంటి లోకేష్

తిరుగుబాటు మొదలైంది.. ఇక సమరమే Advertisement టీడీపీ నేత, చంద్రబాబు ముద్దులకొడుకు లోకేష్ డైలాగ్ ఇది. సోషల్ మీడియాలో ఇతడు పెట్టిన ఈ పోస్ట్ చూసి జనాలు నవ్వుకుంటున్నారు. ఇంట్లోంచి బయటకు వచ్చే ధైర్యం…

తిరుగుబాటు మొదలైంది.. ఇక సమరమే

టీడీపీ నేత, చంద్రబాబు ముద్దులకొడుకు లోకేష్ డైలాగ్ ఇది. సోషల్ మీడియాలో ఇతడు పెట్టిన ఈ పోస్ట్ చూసి జనాలు నవ్వుకుంటున్నారు. ఇంట్లోంచి బయటకు వచ్చే ధైర్యం కూడా లేని లోకేష్.. ఇక సమరమే అంటుంటే నవ్వురాకుండా ఉంటుందా?

రాజధానిపై నానా యాగీ చేస్తోంది టీడీపీ. దీనికి జనసేన, బీజేపీ వత్తాసు పలుకుతున్నాయి. ఎవరి ఉద్యమాలు వాళ్లవి, ఎవరి ఆందోళనలు వాళ్లవి. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ నుంచి లోకేష్  మాయమయ్యారు. మంచి టైమింగ్ దొరికినా, అంతకుమించి అవకాశం అందివచ్చినా లోకేష్ మాత్రం నాలుగు గోడలకే పరిమితమయ్యారు. 

ఈ విషయంలో చంద్రబాబు ఏదో గేమ్ ఆడుతున్నట్టుగా కనిపిస్తోంది. రాజధాని అంశంపై లోకేష్ ను బయటకు రానియ్యలేదు. బాలయ్య చేపట్టాల్సిన కార్యక్రమాన్ని కూడా ఆఖరి నిమిషంలో వాయిదా వేశారు. ఇలా కావాలనే తన కుటుంబ సభ్యుల్ని ఆందోళన కార్యక్రమాలకు దూరంగా పెడుతున్నట్టు అనిపిస్తోంది. అయితే లోకేష్ మాత్రం ట్విట్టర్ లో తన “ఆవేశాన్ని” ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇక సమరమే అంటూ సినిమా డైలాగ్స్ కొడుతున్నారు.

అయితే లోకేష్ ఎప్పట్లానే సీరియస్ గా ట్వీట్ చేసి కామెడీ అయిపోయారు. అతడి ట్వీట్ కు నెటిజన్లు స్పందిస్తున్న తీరు చూస్తే ఎవరికైనా నవ్వు రాకమానదు. ఇక సమరమే అంటూ లోకేష్ ట్వీట్ చేస్తే.. పప్పు తినడానికా అంటూ ఒకరు ప్రశ్నిస్తే, తిరుగుబాటు చేసి పాకిస్థాన్ ను ఆక్రమించేసెయ్ లోకేష్ ఓ పనైపోతుందంటూ సెటైర్లు వేస్తున్నారు మరికొందరు.

కనీసం రోజుకు ఒక ట్వీట్ అయినా వేయి లోకేష్, రోజంతా బోర్ కొడుతోందంటూ మరొకరు ఫన్నీగా రియాక్ట్ అయితే.. మనకెందుకు బ్రదర్ ఇవన్నీ, వాట్సాప్-టిక్ టాక్ వీడియోలు షేర్ చేసుకుందాం రా అంటూ చాలామంది రీట్వీట్ చేశారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. సోషల్ మీడియాలో టీడీపీకి పెద్ద సైన్యమే ఉంది. కానీ అదేంటో లోకేష్ ఏ ట్వీట్ చేసినా ఆ జనం కూడా లైట్ తీసుకుంటారు. లోకేష్ కు మద్దతుగా మాట్లాడే సాహసం చేయరు. ఎందుకంటే, చినబాబు సంగతి అందరికీ తెలిసిందే కదా.

పేదరికం చదువుకు ఆటంకం కావొద్దు

శాసన మండలిని రద్దు చేస్తున్నారా ?