హీరో-డైరక్టర్ చిర్రుబుర్రు!

సినిమా అన్నాక కొన్ని నెలల పాటు కో లివింగ్ లా వుంటుంది యూనిట్ అంతటికీ. అందువల్ల చిన్న చిన్న చిర్రుబుర్రులు వస్తూనే వుంటాయి. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వుండనే వుంటాయి.  Advertisement నిర్మాణంలో వున్న…

సినిమా అన్నాక కొన్ని నెలల పాటు కో లివింగ్ లా వుంటుంది యూనిట్ అంతటికీ. అందువల్ల చిన్న చిన్న చిర్రుబుర్రులు వస్తూనే వుంటాయి. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వుండనే వుంటాయి. 

నిర్మాణంలో వున్న ఓ సినిమా కు సంబంధించి హీరో-దర్శకుల మధ్య ఇలాంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కారణంగా ఈ మధ్యనే చిన్నగా కిందా మీదా పడ్డారని తెలుస్తోంది. నిర్మాణంలో వున్న ఓ సినిమా కోసం ఐటమ్ సాంగ్ ప్లాన్ చేసారు.

దర్శకుడు అసలు ఐటమ్ సాంగ్ వుండాలా? వద్దా? అన్నది క్లారిటీగా తేల్చుకోలేకపోతున్నారని బోగట్టా. వుండాలని ఓసారి, కాదని ఓసారి ఇలా మాట్లాడుతున్నారని తెలుస్తోంది. 

పాట చిత్రీకరణ మీద కూడా ఈ తడబాటు ప్రభావం చూపించినట్లుంది. దాంతో హీరో కాస్త చికాకు పడినట్లు తెలుస్తోంది. దాంతో సరే, పాట వద్దు అని పక్కన పెట్టారు. కానీ తరువాత కాదు, వుంటేనే బెటర్ అని యాడ్ చేస్తున్నారు.

ఇలా డైరక్టర్-హీరో చిర్రుబుర్రులాడుకున్న సంగతి ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టడం ప్రారంభమైంది. అయినా ఈ మధ్య చాలా సినిమాలకు విడుదల దగ్గరకు వచ్చేసరికి హీరో-డైరక్టర్ల మధ్య పొసగకపోవడం అన్నది కామన్ అయిపోయింది. 

రవితేజ సినిమాలకు ఇలాగే ప్రతి సారీ వినిపిస్తూ వుంటుంది. రామబాణం సినిమా కూడా గోపీచంద్-శ్రీవాస్ ల నడుమ ఇలాంటివి జరిగాయని వార్తలు వున్నాయి. అందువల్ల ఇక ఏ సినిమాకు ఇలా జరిగినా టేకిట్ ఈజీ అని లైట్ తీసుకోవాల్సిందేనేమో?