ఇండస్ట్రీలో ఓ చిత్రమైన ముచ్చట వినిపిస్తోంది. ఓ హీరోకి ఆడబిడ్డ కలిగింది. హీరో భార్యకు అమెరికాలో కొన్ని వారాల క్రితం ప్రసవం జరిగింది. ఆడబిడ్డ పుట్టింది అన్నది విశ్వసనీయ వర్గాల బోగట్టా. వెనక్కు వచ్చేసారు కూడా. కానీ ఆ ఆనందకరమైన వార్తను ఎక్కడా షేర్ చేసుకోలేదు. ఎందుకు అన్నది కాస్త ఆసక్తికరమే.
నిజానికి ఇది ఆ హీరో దంపతుల పర్సనల్ స్పేస్ లోని వ్యవహారం. కానీ సెలబ్రిటీ కావడంతో జనాలకు కాస్త ఆసక్తికరం.
ప్రీ మెచ్యూర్ బేబీ అని, అందువల్లే చెప్పడం లేదని ఓ వెర్షన్ వినిపిస్తోంది. కాదు, పెళ్లికి ముందు నుంచి డేటింగ్ లో వుండడం వల్ల, ‘కొంచెం’ ముందగానే భార్య కన్సీవ్ కావడం, ఆ డేట్ కు అనుగుణంగా డెలివరీ కావడం జరిగిందని, అందుకే లెక్కలు చూసుకుని చెబుతారని కూడా మరో వెర్షన్ వినిపిస్తోంది.
ఇది కూడా పెద్ద వింతేం కాదు. ఈ రోజుల్లో లివిన్ అంటూ పెళ్లి కాకుండానే కలిసి వుంటున్నారు. అలాంటిది పెళ్లికి ముందు ఎంగేజ్ మెంట్ అయిపోయాక కాస్త సరదా పడితే తప్పేం లేదు. పైగా పెళ్లి చేసుకున్నారు కానీ మానలేదు కదా. కానీ అప్పుడు కూడా ఈ వార్త ఎందుకు అంటే జస్ట్.. హీరో కదా.. రీడర్స్ కు కాస్త ఆసక్తికరం.. అందుకే.