Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హీరోయిన్ కోసం షూటింగ్ వెయిటింగ్

హీరోయిన్ కోసం షూటింగ్ వెయిటింగ్

అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ సినిమా సెట్ అయింది. పూజ అయింది. కానీ సెట్ మీదకు మాత్రం వెళ్లేది కనిపించడం లేదు. దీనికి కారణం మరేం లేదు. హీరోయిన్ దొరక్కపోవడమే. ఇప్పటిదాకా ఈ సినిమా హీరోయిన్ దొరకలేదు. హీరోయిన్ ఫైనల్ అయితే సినిమాను సెట్ మీదకు తీసుకెళ్దాం అని చూస్తున్నారు. కానీ అదే జరగడం లేదు.

అఖిల్ కు మొదటి నుంచీ ఇదే సమస్య. అతని సినిమాలకు హీరోయిన్లు సెట్ కావడం ఎప్పుడూ లేటే. అదే ఆనవాయితీ ఈ సినిమాకు కూడా కంటిన్యూ అవుతున్నట్లు కనిపిస్తోంది. అఖిల్ సినిమాకు హీరోయిన్ ఎంపిక బాధ్యతను నిర్మాత బన్నీవాస్ టేకప్ చేసినట్లు తెలుస్తోంది. వీలయినంత వరకు కొత్త హీరోయిన్ నే వెదుకుతున్నారు.

గతంలో కూడా అఖిల్ రెండు సినిమాలకు కొత్త హీరోయిన్ల సరసనే నటించాడు. ఇప్పుడు ఇది నాలుగో సినిమా. ఇది కూడా అదే ఆనవాయితీని కొనసాగించేలా కనిపిస్తోంది. ఇటీవలే నిర్మాత బన్నీ వాస్ తను సాయిధరమ్ తేజ్ తో చేసే సినిమా కోసం కూడా కొత్త హీరోయిన్ కోసం వెదికి, మళ్లీ మనసు మార్చుకుని రాశీఖన్నాను తీసుకున్నారు. అఖిల్ సినిమా కోసం మాత్రం వెదుకులాట కొనసాగుతోంది.

దాడులపై బాబు మౌనం.. ఓటమికి ఇది కూడా కారణమే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?