Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రాక్షసుడు కొత్త డేట్ ఫిక్స్

రాక్షసుడు కొత్త డేట్ ఫిక్స్

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తయారైన రీమేక్ రాక్షసుడు. ఈ సినిమా రెడీ అయిపోయింది కానీ సరైన డేట్ కోసం నిరీక్షిస్తోంది. వాస్తవానికి జూలై 19న విడుదల అని ఫిక్స్ అయింది. కానీ పూరి-శ్రీరామ్ ల ఇస్మార్ట్ శంకర్ 12న నుంచి 19కి సడెన్ గా వచ్చింది. 'ఇదేం అన్యాయం. మా పరిస్థితి ఏమిటి'? అని రాక్షసుడు తరపున ఇస్మార్ట్ శంకర్ కు లేఖ ఇచ్చినా లాభం లేకపోయింది. దాంతో ఇక తప్పదని మరో డేట్ కోసం వెదికారు.

ఆఖరికి ఆగస్టు 2 డేట్ గా ఫిక్స్ చేసుకున్నారు. ఇదిలావుంటే అదే డేట్ కు రావాల్సిన శర్వానంద్ 'రణరంగం' సినిమా అక్కడే వుంది. అంటే శర్వానంద్ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా పోటీ పడుతుందన్నమాట. లేదా ఓ సినిమా వాయిదా పడన్నా పడాలి. ఇప్పటికే రాక్షసుడు వాయిదాలు పడి ఇక్కడకు చేరుకుంది. మరి శర్వానంద్ సినిమా వాయిదా పడుతుందన్న ధీమానేమో?

అయితే అటు ఇస్మార్ట్ శంకర్, ఇటు రాక్షసుడు, ఆఫైన రణరంగం సినిమాలు అన్నింటికీ నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజే. అందుకే ఆయనే ఈ డేట్ లు అన్నీ సర్దుబాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. రణరంగం వెనక్కు వెళ్తే ఫరవాలేదు. లేదూ అంటే రాక్షసుడు సినిమాకు కాస్త ఇబ్బంది వుండొచ్చు. ఎందుకంటే శర్వాకు వున్న ఫ్యామిలీ క్రేజ్ బెల్లంకొండ శ్రీనివాస్ కు లేదు. అలాగే సుధీర్ వర్మకు వున్న క్రేజ్ రమేష్ వర్మకు లేదు.

దాడులపై బాబు మౌనం.. ఓటమికి ఇది కూడా కారణమే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?