కంసమామ.. వెంకీమామ?

మనవాళ్లు సినిమా కథల కోసం రకరకాల సోర్స్ లు వెదుకుతారు. బాపు, మణిరత్నం లాంటివాళ్లు పురాణాలు సోషలైజ్ చేసి కథలు అల్లారు. ఈతరం దర్శకులు కొంతమంది పాత సినిమా కథలను కాస్త అటు ఇటు…

మనవాళ్లు సినిమా కథల కోసం రకరకాల సోర్స్ లు వెదుకుతారు. బాపు, మణిరత్నం లాంటివాళ్లు పురాణాలు సోషలైజ్ చేసి కథలు అల్లారు. ఈతరం దర్శకులు కొంతమంది పాత సినిమా కథలను కాస్త అటు ఇటు చేసి, పాత్రలను అటు ఇటు మార్చి కొత్త కథలు అల్లారు. ఇక ఫారిన్ సినిమాల సిడీల సంగతి చెప్పనక్కరలేదు.

నాగచైతన్య-వెంకటేష్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు భాగవతం పురాణంలోని ఓ పాయింట్ ఆధారం అని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. వెంకీమామ సినిమాకు కోన వెంకట్, జనార్థన మహర్షి, డైరక్టర్ రవీంద్ర కలిసి పనిచేసారు. సినిమా కథ ఏమోకానీ, పాయింట్ మాత్రం పురాణంలో కంసమామ టైపు అని తెలుస్తోంది.

అయితే కంసమామ, మేనల్లుడు కృష్ణుడి పాలిట విలన్. ఇక్కడ వెంకీ మామ అలా కాదు. కానీ రెండింటికీ కామన్ పాయింట్, మామకు అల్లుడి వల్ల గండం వుంటుంది అన్న జ్యోతిష్యం పాయింట్ అని తెలుస్తోంది. మరి ఈ పాయింట్ ను ఫన్నీగా ఎలా డీల్ చేసి, వెంకీ-చైతూల మధ్య ఫన్ రాబట్టారో చూడాలి.

ఇదిలావుంటే వెంకీ మామనే కాదు, ప్రభాస్ – రాధాకృష్ణల 'జాను' (వర్కింగ్ టైటిల్)కు కూడా జ్యోతిష్యం, పామిస్ట్రీ, ఒకరివల్ల మరోకరికి గండం అనే పాయింట్ తోనే తయారవుతోందని తెలుస్తోంది. అంటే జ్యోతిష్యం సినిమాల సీజన్ స్టార్ట్ అయిందన్నమాట.

దాడులపై బాబు మౌనం.. ఓటమికి ఇది కూడా కారణమే