హీరోకి నచ్చకుండా ఏ హీరోయిన్ ను ఏ సినిమాలోకీ తీసుకోరు. అయితే ఈ హీరో వ్యవహారం వేరు. ఆయనకు నచ్చితే కాస్త ఎక్కువ ప్రేమించేస్తారు.
అందమైన హీరోయిన్ లకు ఇట్టే పడిపోతాడని టాక్ వుండనే వుంది. పైగా ఆ హీరోపై, ఆయిన మారిటల్ లైఫ్ పై రకరకాల గ్యాసిప్ లు వుండనే వున్నాయి. లేటెస్ట్ గా ఈ ‘కలెక్షన్’ లో మరో పేరు చేరిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆ మధ్య ఓ మల్టీ స్టారర్ సినిమా చేసారు ఈ హీరో. అందులో నటించిందీ పక్క రాష్ట్రం అమ్మాయి. ఒడ్డు పొడవు బాగుంటుంది. చీర కడితే ‘బాపు బొమ్మలా’ వుందని పాడేసుకునేలా వుంటుంది.
ఇంకేం వుంది ఈ హీరోగారి దృష్టి అటు మళ్లిపోయిందని టాక్. దానికి తోడు ఈ అమ్మడు కూడా ఎలా పడిపోయిందో అటు పడిపోయిందని టాక్.
దాంతో ఇప్పుడు ఆ అమ్మడు..ఈ హీరోగారి ప్రాపకంలోకి వెళ్లిపోయిందని, అందుకే తెలుగులో తరువాత వరుసగా పెద్దగా అవకాశాలు లేకున్నా, మకాం ఇక్కడే ఫిక్స్ చేసుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిజానికి ఈ గుసగుసల కన్నా ముందు, ఒడ్డు పొడవు వుండి, చీరకట్టు బాగుంటే ఇష్టపడే డైరక్టర్ ఒకరు ఈమెను ఇష్టపడుతున్నారని గుసగుసలు వినిపించాయి.
కానీ అది కాదు, అసలు విషయం ఇదీ అని ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. మొత్తానికి ఫ్యామిలీకి కాస్త దూరంగా వుంటున్న హీరోగారికి మంచి కాలక్షేపం దొరికినట్లే అనుకోవాలేమో?