హీరోయిన్‌ని చెయ్యండి సార్‌

హీరోయిన్‌గా నిలదొక్కుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని ఒకటి రెండు సినిమాలు చేసిన అమ్మాయిలందరికీ అనుభవమే. ‘అనుమానాస్పదం’ సినిమాతో క్రియేటివ్‌ డైరెక్టర్‌ ‘వంశీ’ అందించిన భామ హంసా నందిని. ఆ పేరు పెట్టింది కూడా…

హీరోయిన్‌గా నిలదొక్కుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని ఒకటి రెండు సినిమాలు చేసిన అమ్మాయిలందరికీ అనుభవమే. ‘అనుమానాస్పదం’ సినిమాతో క్రియేటివ్‌ డైరెక్టర్‌ ‘వంశీ’ అందించిన భామ హంసా నందిని. ఆ పేరు పెట్టింది కూడా ఆయనే. 

తన మొదటి సినిమా టైటిల్‌లాగే ఆమె కూడా అనుమానాస్పదంగా కనిపిస్తుండడంతో హీరోయిన్‌కన్నా వ్యాంప్‌గా, ఐటమ్‌గర్ల్‌గా బాగా పనికొస్తుందని ఇండస్ట్రీ నిర్ణయించేసుకుంది. పైగా ఆర్యన్‌ రాజేష్‌ లాంటి హీరోతో నటిస్తే జాతకం అలాగే వుంటుంది కూడా.

చిన్నా చితకా పాత్రలూ, పాటలూ కలిసి ప్రవరాఖ్యుడు, ఈగ, భాయ్‌, రామయ్యా వస్తావయ్యా, అధినేత సినిమాల్లో చేసింది. ముఖ్యంగా ఇప్పుడు బాలకృష్ణ లెజెండ్‌లో ఒక పాటకు డాన్సులేసింది.

 దీంతో బాలయ్యదగ్గర తన గోడునంతా వెల్లబోసుకుని, నాకేం తక్కువ సార్‌.. హీరోయిన్‌కి కావలసినవన్నీ వున్నాయి.. ఎటొచ్చీ మీలాంటి హీరోల ఆశీర్వాదమే లేదు.. అని కన్నీళ్ళ పర్యంతమయ్యిందట. దాంతో బాలయ్యబాబు తప్పకుండా నీ సమస్యని పరిశీలిస్తానని మాటిచ్చాడట. చూడాలి, హంసానందిని మళ్ళీ హీరోయిన్‌ అవుతుందో లేదో.