మళ్ళీ దుమ్మురేపుతోన్న షకీరా

‘వాకా వాకా..’ అంటూ 2010 ప్రపంచ కప్‌ ఫుట్‌ బాల్‌ పోటీల కోసం ప్రత్యేక గీతాన్ని ఆలపించి, డాన్స్‌ చేసిన ప్రపంచ పాప్‌ స్టార్‌ షకీరా, మరోమారు 2014 ప్రపంచ కప్‌ ఫుట్‌ బాల్‌…

‘వాకా వాకా..’ అంటూ 2010 ప్రపంచ కప్‌ ఫుట్‌ బాల్‌ పోటీల కోసం ప్రత్యేక గీతాన్ని ఆలపించి, డాన్స్‌ చేసిన ప్రపంచ పాప్‌ స్టార్‌ షకీరా, మరోమారు 2014 ప్రపంచ కప్‌ ఫుట్‌ బాల్‌ పోటీల కోసం ప్రత్యేక గీతాన్ని తయారుచేసింది. ఈ పాట ఇప్పటికే ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

బ్రెజిలియన్‌ అప్‌ బీట్‌తో సాగిన ఈ పాటలో వెరైటీ డాన్స్‌ మూమెంట్స్‌ని షకీరా ప్లాన్‌ చేసిందట. చూడ్డానికి ఏమంత గొప్పగా లేకపోయినా, సంప్రదాయ డాన్సులు కావడంతో అభిమానులు ఉర్రూతలూగుతున్నారు అప్పుడే.

‘వాకా వాకా’ పాటకి అనుగుణంగా ప్రపంచంలోని వివిధ భాషల్లో సంగీత దర్శకులు, గాయకులు.. సరికొత్త పాటల్ని సృష్టించుకున్నారు. ఆ మాటకొస్తే, షకీరా ‘వాకా వాకా’ పాటలో చేసిన హిప్‌ మూమెంట్స్‌.. హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ దాకా.. ప్రపంచంలోని పలు సినీ పరిశ్రమల్లో ఇప్పటికీ హల్‌చల్‌ చేస్తూనే వున్నాయి. ఇంకా అధికారికంగా పాట విడుదల కాకుండానే షకీరా పాట దుమ్మురేపేస్తోంటే, అధికారికంగా పాట బయటకొచ్చాక పరిస్థితి ఇంకెలా వుంటుందో.!