హీరోయిన్ని తెస్తేనే చాన్స్

పాపం, ఆ హీరోగారికి ఎందుకో ఆ హీరోయిన్ అంటే ఇష్టం కలిగింది. తన సినిమాలో ఆమె నటిస్తే బాగుంటుందనిపించింది. కానీ ఆమె నో అన్నది. ఇలా ఒకసారి కాదు, రెండుసార్లు అయింది. దాంతో మూడో…

పాపం, ఆ హీరోగారికి ఎందుకో ఆ హీరోయిన్ అంటే ఇష్టం కలిగింది. తన సినిమాలో ఆమె నటిస్తే బాగుంటుందనిపించింది. కానీ ఆమె నో అన్నది. ఇలా ఒకసారి కాదు, రెండుసార్లు అయింది. దాంతో మూడో సినిమా దగ్గరకు వచ్చేసరికి, డైరక్టర్ కు ఒకటే కండిషన్..

ఆ హీరోయిన్ తెచ్చుకో..సినిమా చాన్స్ పుచ్చుకో అని. అప్పుడు ఆ హీరోయిన్ వెంట పడ్డారు..అమ్మా..తల్లీ..అన్నారు. కావాలంటే కాస్త ఎక్కువ తీసుకో అన్నారు..అదీ సరిపోకపోతే, ఓ ఖరీదైన బహుమతి ఇచ్చారు.

దాంతో అమ్మడు కరుణించింది.సినిమా మొదలైంది. అదీ కథ. హీరోగారు తన సినిమాకు ఆ హీరోయినే కావాలని మనసు పడితే తప్పదు కదా మరి.