హిప్పీ పబ్లిసిటీ పీక్స్

ఇటీవల కాలంలో ఓ మీడియం సినిమాకు బీభత్సమైన పబ్లిసిటీ అంటే హిప్పీ సినిమానే చెప్పుకోవాలేమో? తమిళంలో అనేక సినిమాలు నిర్మించిన కలైపులి థాను తెలుగులో నిర్మిస్తున్న సినిమా హిప్పీ. ఆర్ ఎక్స్ 100 తరువాత…

ఇటీవల కాలంలో ఓ మీడియం సినిమాకు బీభత్సమైన పబ్లిసిటీ అంటే హిప్పీ సినిమానే చెప్పుకోవాలేమో? తమిళంలో అనేక సినిమాలు నిర్మించిన కలైపులి థాను తెలుగులో నిర్మిస్తున్న సినిమా హిప్పీ. ఆర్ ఎక్స్ 100 తరువాత కార్తికేయ చేస్తున్న సినిమా. దాంతో బిజినెస్ అంచనాలు అన్నీ బాగానే వున్నాయి. కానీ అసలు బిజినెస్ స్టార్ట్ చేయడానికి, సినిమా విడుదల ప్లాన్ చేయడానికి చాలాకాలం ముందు నుంచే నిర్మాత పబ్లిసిటీ చేసుకుంటూ రావడం విశేషం.

ముఖ్యంగా సినిమా ప్లాన్ చేసిన డే వన్ నుంచే ప్రింట్ పబ్లిసిటీ స్టార్ట్ చేసారు. దాదాపు సినిమా షూట్ నడుస్తున్నంత కాలం, ప్రతి అకేషన్ కు పబ్లిసిటీ చేస్తూనే వచ్చారు. అలాగే సినిమా ఇంటర్వూలు, ప్లానింగ్, ప్రీరిలీజ్ ఫంక్షన్ అన్నీ పెద్ద సినిమా రేంజ్ లో చేయడం విశేషం.

మరి ఈ పబ్లిసిటీ మాహత్యమో? సినిమా కంటెంట్ మీద నమ్మకమో కానీ, ప్రీరిలీజ్ ఫంక్షన్ లో ఎల్ కెజి నుంచి డిగ్రీ వరకు అన్నట్లుగా తెగ మాట్లాడేసాడు కార్తికేయ. ఆ మాటల్లో కారప్పొడి నుంచి కొరియా వరకు ఏవేవో వున్నాయి. బహుశా ఒక సినిమా హిట్ తరువాత మళ్లీ మాట్లాడే అవకాశం ఇప్పుడే వచ్చిందనే హడావుడో? ఆనందమో?

సినిమాను బాగానే మార్కెట్ చేసారు. ఇది కనుక విజయ తీరం చేరితే కార్తికేయ హీరోగా ఫిక్స్ అయిపోతాడు. సినిమాలు క్యూ కడతాయి. కానీ ఒక్కటే అనుమానం ఈ సినిమాలో జేడి చక్రవర్తి వున్నారు. ఆయన నటించిన సినిమాలు ఏవీ ఇటీవలి సంవత్సరాల్లో అంతగా ఫేర్ చేయలేదు. ఆ సెంటిమెంట్ ను ఈ సినిమా పోగొడుతుందని ఆశిద్దాం.

కోట్లు పెట్టుబడి పెట్టి.. అవినీతి రహిత పాలనకు ఒప్పుకుంటారా?