నిర్మాతగా హీరో నాని రెండు సినిమాలు తీసారు. మొదట తీసిన అ! సినిమాకు పెద్దగా పైసలు రాలేదు కానీ, రెండో సారి తీసిన హిట్ సినిమాకు మాత్రం బాగానే కిట్టుబాటు అయిందని వార్తలు వున్నాయి. తక్కువలో తీసిన ఈ సినిమా మంచి బిజినెస్ నే చేసింది. కొన్నవాళ్లు కూడా అలా అలా బయటపడిపోయారు. నాన్ థియేటర్, థియేటర్ కలిపి బాగానే లాభం వచ్చింది.
ఇప్పుడు మరో కోటి రూపాయలు అదనంగా వచ్చింది. నిర్మాత దిల్ రాజు ఈ హిట్ సినిమా రీమేక్ హక్కులు తీసుకున్నారు. అందుకు గాను కోటి రూపాయలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది అనుకోని అదనపు ఆదాయమే. హిందీ సినిమాల కోసం దిల్ రాజు ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ను పెట్టి ఇప్పటికే జెర్సీ సినిమాను అల్లు అరవింద్, నాగవంశీల భాగస్వామ్యంతో ప్రారంభించారు. ఇప్పుడు ఇది రెండో సినిమా.
తెలుగులో వచ్చిన మంచి సినిమాల హక్కులు కొని ఈ బ్యానర్ మీద హిందీలో తీయాలన్నది దిల్ రాజు ఆలోచన. ఆ క్రమంలోనే ఎప్ 2 కూడా వుండనే వుంది.