ఢాకూ లో.. ఎందరు హీరోయిన్లు?

బాబీ- బాలయ్య కాంబినేషన్ లో సితార సంస్థ నిర్మిస్తున్న సినిమా ఢాకూ మహరాజ్. ఈ సినిమాలో ముందు నుంచి అనుకుంటున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. అయితే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమాలో…

బాబీ- బాలయ్య కాంబినేషన్ లో సితార సంస్థ నిర్మిస్తున్న సినిమా ఢాకూ మహరాజ్. ఈ సినిమాలో ముందు నుంచి అనుకుంటున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. అయితే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమాలో ఒకటికి మించిన హీరోయిన్లు వున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఓ మగ పాత్రను ఆడపాత్రగా మార్చినట్లు తెలుస్తోంది.

విషయం ఏమిటంటే బాబీ- బాలయ్య సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి మరో హీరో వుంటారని వినిపించింది. దానికి చాలా పేర్లు కూడా వినిపించాయి. దుల్కర్ సల్మాన్, విష్వక్ సేన్ ఇలా కొన్ని పేర్లు వినిపించాయి. కానీ తరువాత ఏమయిందో తెలియదు. మరే పేరు వినిపించలేదు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మరో హీరో అన్న పాత్రను తీసేసి, మరో హీరోయిన్ అనే పాత్రగా మార్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ పాత్రకు శ్రద్ద శ్రీనాధ్ ను తీసుకున్నారని సమాచారం. ఇద్దరు హీరోల సెటప్ అంటే మళ్లీ ఇటీవలే బాబీ తీసిన వాల్తేర్ వీరయ్య గుర్తుకు వస్తుంది. మరి అందుకే ఇలా చేసారా అన్నది తెలియదు.

ఇదిలా వుంటే ఈ సినిమా క్లయిమాక్స్ లో మరో హీరోయిన్ కూడా కనిపిస్తారని బోగట్టా. ఆ పాత్రను ఊర్వశి రౌతాలా చేస్తున్నారట.

ఈ విషయాలన్నింటిపై నిర్మాత నాగవంశీని అడగ్గా, మరో హీరో పాత్ర తీసేయడం ఏమీ లేదని, ముందు అనుకున్న కథ కాకుండా ఇది వేరే స్క్రిప్ట్ అని అన్నారు.

6 Replies to “ఢాకూ లో.. ఎందరు హీరోయిన్లు?”

Comments are closed.