ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా వుంది. చాలా ఏళ్లుగా రామ్మూర్తినాయుడు అల్జీమర్స్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలిసింది.
రామ్మూర్తినాయుడి ఆరోగ్యం విషమించడంతో చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ తన పర్యటనలన్నీ రద్దు చేసుకుని హైదరాబాద్‌కు వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అనంతరం ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి వుంది. అయితే తమ్ముడి ఆరోగ్య పరిస్థితి విషమంగా వుండడంతో మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్నారు.
ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి చంద్రబాబు చేరుకోనున్నారు. తమ్ముడిని పరామర్శించనున్నారు. ఇదిలా వుండగా రామ్మూర్తినాయుడు 1994-99 మధ్య చంద్రగిరి నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. అనంతరం ఆయన అనారోగ్య కారణంతో రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. రామ్మూర్తినాయుడి తనయుడు నారా రోహిత్ టాలీవుడ్ హీరో. ఇటీవలే ఆయన నిశ్చితార్థం జరిగింది.
he passed away.. RIP
Rest in peace
vc available 9380537747