ఏంపాట్లొచ్చాయ్ రాజా…??

ఆనంద్‌తో మంచి కాఫీలాంటి హీరో అనిపించుకొన్నాడు రాజా. ఆ పేరు చెప్పి ఏళ్ల త‌ర‌బ‌డి బండి లాగిస్తున్నాడు. ఓ సినిమా ఇంత మైలేజీ ఇస్తుందా?  అని అంద‌రూ ముక్కున వేలేసుకొనేలా చేస్తున్నాడు. ఆనంద్ త‌ర‌వాత…

ఆనంద్‌తో మంచి కాఫీలాంటి హీరో అనిపించుకొన్నాడు రాజా. ఆ పేరు చెప్పి ఏళ్ల త‌ర‌బ‌డి బండి లాగిస్తున్నాడు. ఓ సినిమా ఇంత మైలేజీ ఇస్తుందా?  అని అంద‌రూ ముక్కున వేలేసుకొనేలా చేస్తున్నాడు. ఆనంద్ త‌ర‌వాత ఒక్కటంటే ఒక్క హిట్టూ లేదు. మ‌ధ్యలోవిల‌నిజం కూడా చూపించాడు. కానీ చాక్లెట్ బోయ్‌కి ర‌గ్గడ్ లుక్ ఏమాత్రం స‌రిపోలేదు.

వ‌చ్చిన ప్రతీ సినిమా ఒప్పుకోవ‌డం.. అది కాస్త ప్లాప్ అయి కూర్చోవ‌డం.. రాజాది ఇదే ప‌రిస్థితి. ఈయ‌న గారికి శాటిలైట్‌మార్కెట్ కూడా లేదాయె. రాజా సినిమానా…?  మాకెందుకురాజా…??  అంటున్నారు టీవీ ఛాన‌ల్ వాళ్లు. అంత కామెడీ అయిపోయాడు. లేటెస్టుగా తుమ్మెద అనే సినిమా చేశాడు.  ఆ సినిమా ట్రైల‌ర్ చూస్తుంటే.. టీవీ సీరియ‌ల్ కంటే దారుణంగా ఉంది. 

అందులో రాజా న‌ట‌న చూస్తే, మ‌నోడింకా బీసీ కాలంలోనే ఉన్నాడ‌నిపిస్తుంది. రాజా ఎప్పుడు మార‌తాడో ఏంటో..??