ఇద్దరు ఐరెన్ లెగ్గుల మ‌ధ్య మ‌హేష్

చిత్రసీమ‌లో సెంటిమెంట్లకు కొద‌వ ఉండ‌దు. అయితే అందులో హీరోల‌కు మిన‌హాయింపు ఉంటుంది. హిట్లు లేని హీరోతో సినిమాలు తీస్తారు గానీ, ఐరెన్ లెగ్ అనిపించుకొంటున్న హీరోయిన్లకు మాత్రం దూరంగా ఉంటారు.  Advertisement కానీ మ‌హేష్…

చిత్రసీమ‌లో సెంటిమెంట్లకు కొద‌వ ఉండ‌దు. అయితే అందులో హీరోల‌కు మిన‌హాయింపు ఉంటుంది. హిట్లు లేని హీరోతో సినిమాలు తీస్తారు గానీ, ఐరెన్ లెగ్ అనిపించుకొంటున్న హీరోయిన్లకు మాత్రం దూరంగా ఉంటారు. 

కానీ మ‌హేష్ బాబు మాత్రం, ఒకరు కాదు, ఇద్దరు ఐరెన్ లెగ్గుల‌తో సినిమా చేయ‌బోతున్నాడు. అదే ఆగ‌డు. శ్రీ‌నువైట్ల‌, మ‌హేష్ కాంబినేష‌న్లో రూపుదిద్దుకొంటున్న చిత్రమిది. ఓ క‌థానాయిక‌గా త‌మ‌న్నాను ఎంచుకొన్నారు. ఈ సినిమాలో రెండో నాయిక కూడా ఉంద‌ని స‌మాచార‌మ్‌. ఆ స్థానం తాప్సికి ద‌క్కింద‌ట‌. ఊస‌ర‌వెల్లి, కెమెరామెన్ గంగ‌తో రాంబాబు, రెబ‌ల్‌… ప‌ట్టింద‌ల్లా ఫ్లాప్ అవుతోంది త‌మ‌న్నాకి. అందుకే చాలా అవ‌కాశాల్ని కోల్పోయింది. 

అటు తాప్సి కెరీర్ మ‌రీ దారుణం. మిస్టర్ ప‌ర్‌ఫెక్ట్ సినిమా ఒక్కటే ఆమె కెరీర్‌లో నికార్సయిన హిట్టు. ఆ సినిమాలో తాప్సి చేసిందేం లేదు. అందుకే ఐరెన్ లెగ్ అనే ముద్ర వేయించుకొంది. మ‌రి వీరిద్దరితో విజ‌యాల మీదున్న ప్రిన్స్ ఎలా నెట్టుకొస్తాడో..?