మహేష్‌బాబు '1' ఆడియో విడుదల కోసం భారీ కసరత్తులు జరుగుతున్నాయి. ఈ పాటల వేడుకను అమెరికాలో ఏర్పాటు చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అయితే ముందు అనుకొన్నట్టు డిసెంబరు 14న కాదు. 22న ఈ కార్యక్రమం నిర్వహిస్తారట. ఆడియో సేల్స్ భయంకరంగా పడిపోయాయి. ప్లాటినమ్‌డిస్క్ ఫంక్షన్లు చేస్తున్నారన్నమాటే గానీ, లక్ష క్యాసెట్లు అమ్ముడు పోవడం ఈ రోజుల్లో అద్భుతమే.
అయితే మహేష్ '1' ఆడియోని జనంలోకి తీసుకెళ్లాలని నిర్మాతలు భావిస్తున్నారు. తొలిరోజు కనీసం పది లక్షల క్యాసెట్లు అమ్మాలని ధ్యేయంగా పెట్టుకొన్నారట. ఈ రోజుల్లో పది లక్షల క్యాసెట్లు అమ్ముడవ్వడం మామూలు విషయమా?? కానీ దాన్ని సాధ్యం చేయడానికి చిత్రబృందం ఓ సరికొత్త ఆలోచన చేస్తోంది. '1' ఆడియో వేడుకను థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించాలనే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
టికెట్ తో పాటు ఓ కిట్ ఇస్తారు. అందులో ఆడియో సీడీ కూడా ఉంటుంది. దాని ధర టికెట్ రూపంలో చెల్లించాల్సివుంటుదన్నమాట. ఆడియో వేడుక థియేటర్లలో కనీసం పది లక్షల మంది వీక్షించే అవకాశం ఉంది కదా..? అదీ '1' లెక్క. ఈ ప్రణాళిక సఫలీకృతం అయితే… మహేష్ '1'… ఆడియో అమ్మాకాల్లోనూ నెం '1' అవుతుంది.