Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హుషారుగా ప్రభాస్

హుషారుగా ప్రభాస్

సాహో సినిమా తరువాత హీరో ప్రభాస్ జనం ముందుకు రాకపోయినా, టాలీవుడ్ లో సన్నిహితులకు కనిపిస్తూనే వున్నాడు. మొన్నటికి మొన్న తను చేయబోయే సినిమాకు సంబంధించి ఓ స్టిల్ వదిలాడు. అయితే నిన్నటికి నిన్న మాత్రం టాలీవుడ్ ప్రముఖులందరితో ప్రభాస్ ఫుల్ ఖుషీగా, హుషారుగా భుజం భుజం కలిపి తిరిగాడు.

పెదనాన్న కృష్ణం రాజు బర్త్ డే సందర్భంగా ఇచ్చిన భారీ పార్టీకి సినిమా ప్రముఖులు అందరూ హాజరయ్యారు. మెగాస్టార్ దగ్గర నుంచి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వరకు ఎందరో ప్రముఖులు ఈ ఫంక్షన్ కు హాజరయ్యారు. వచ్చిన వారందనిరీ రిసీవ్ చేసుకుని పలకరించినట్లు బోగట్టా.

అయితే ఇది మాత్రమే కాదు విశేషం. సాహో నాటితో పోల్చుకుంటే ప్రభాస్ ఫిజిక్ ఇప్పుడు చాలా బాగుందని, కాస్త తగ్గి, కరెక్ట్ కొలతలతో, మాన్లీగా, అందంగా కనిపిస్తున్నాడని ఫంక్షన్ కు హాజరయినవారి బోగట్టా. ప్రస్తుతం ప్రభాస్ ఏ సినిమా కూడా ఓకె అనలేదు. ఇంతకు ముందు స్టార్ట్ చేసిన రాధాకృష్ణ డైరక్షన్ లోని సినిమా పూర్తి చేసిన తరువాతే మరో సినిమా అనే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది.

సునీల్ టైమింగ్ కి హాట్స్ ఆఫ్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?