ఇద్దరు బయ్యర్ల ఆర్ఆర్ఆర్ ముచ్చట

నిన్నటికి నిన్న ఇద్దరు బయ్యర్లు ముచ్చటించుకున్నారు. ఒకరు ఆర్ఆర్ఆర్ ను ఓ కోస్తా జిల్లా కు కొన్నవారు..ఇంకొంకరు కొని ముందే లాభానికి వదిలేసిన వారు. విషయం ఏమిటంటే ఆర్ఆర్ఆర్ బ్రేక్ ఈవెన్ అవుతుందా? కాదా?…

నిన్నటికి నిన్న ఇద్దరు బయ్యర్లు ముచ్చటించుకున్నారు. ఒకరు ఆర్ఆర్ఆర్ ను ఓ కోస్తా జిల్లా కు కొన్నవారు..ఇంకొంకరు కొని ముందే లాభానికి వదిలేసిన వారు. విషయం ఏమిటంటే ఆర్ఆర్ఆర్ బ్రేక్ ఈవెన్ అవుతుందా? కాదా? అన్నది. 

దానికి  కొన్న బయ్యర్ బదులిస్తూ, ఉగాది రెండు రోజులు అనుకూలిస్తే ఓ పాతిక యాభై లక్షలు నష్టంతో బయటపడతామన్నారు. లేదూ అంటే పది శాతం తేడా వస్తుందన్నారు.

మరి అడ్వాన్స్ కు కట్టిన వడ్డీలు, ఖర్చుల మాటేమిటి అని అడిగితే, ఇక వాటిని మర్చిపోవడమే అని సమాధానం వచ్చింది కొనుగోలు చేసిన బయ్యర్ నుంచి.

మరి అంతా వృధా ప్రయాస అయింది కదా? అదే అడ్వాన్స్ ను ఏ భూమి కొనుగోలు మీదనో పెట్టి వుంటే ఇప్పటికి అంతకు అంతా లాభం వచ్చి వుండేది కదా అన్నది రెండో బయ్యర్ పాయింట్.

నిజమే..ఇప్పడు సినిమాల అమ్మకాల రేట్లు, టికెట్ రేట్లు, ఓటిటి అన్నీ చూస్తుంటే డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం కన్నా రియల్ ఎస్టేట్ నే బెటర్ అనిపిస్తోంది అన్నది మొదటి బయ్యర్ నిర్వేదం. 

ఈ డిస్కషన్ ఈ రైటర్ అక్కడ వుండగానే జరిగింది. మరి ఇప్పుడుచెప్పండి..రోజు రోజుకూ కోట్లకు కోట్లు కలెక్షన్లు అంకెల్లో చూపించేస్తున్న మహానుభావులూ… ఆర్ఆర్ఆర్ సినిమా బయ్యర్లకు లాభమా? నష్టమా?